epaper
Monday, September 28, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బీఆర్ఎస్‌ గుర్తింపు రద్దు చేయాలి

బీఆర్ఎస్‌ గుర్తింపు రద్దు చేయాలి
కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు, తాత మధుపై చట్టబద్ధ పోరాటం
దళితుల హక్కుల ఉల్లంఘనపై పదవులు, పార్టీలు చూడం
ఎక్కడ అన్యాయం జరిగినా బాధితుల పక్షాన నిలబడతాం
రాజ్యాంగమే మా ఆయుధం.. అన్యాయంపై రాజీ లేదు
బీఆర్ఎస్‌ గుర్తింపుపై ఎన్నికల చట్టాల ప్రకారం నిర్ణయం
మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, కాంగ్రెస్ నాయ‌కుడు పెరుమాండ్ల రామకృష్ణ

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : దళితుల గౌరవం, ఆత్మగౌరవం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది లేదని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, కాంగ్రెస్ నాయ‌కుడు పెరుమాండ్ల రామకృష్ణ స్పష్టం చేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు, తాత మధు తదితర ప్రజాప్రతినిధులపై తమ వినతిలో పేర్కొన్న అంశాలను సంబంధిత రాజ్యాంగ, చట్టబద్ధ సంస్థలు స్వతంత్రంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బీఆర్ఎస్‌ పార్టీ గుర్తింపును ఎన్నికల చట్టాలు, నిబంధనల ప్రకారం పరిశీలించి రద్దు చేయాలని కోరారు. కేసీఆర్‌ ఇంటి వద్ద పసుపు నీళ్ల శుద్ధి, స్పీకర్‌పై అభ్యంతరకర పదజాలం వినియోగం తదితర అంశాలపై మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు రెగుంట సునీల్ మాదిగ సమర్పించిన వినతిని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్‌ 22న అవసరమైన చర్యల కోసం చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారికి పంపినట్లు వారు తెలిపారు.

దళితులపై వివక్షకు చోటులేదు
రాజ్యాంగం కల్పించిన సమాన గౌరవం, హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు. గద్వాలలో ప్రేమవివాహం విషయంలో దళితుని ఇల్లు కూల్చివేత, సిద్దిపేటలో వినాయక భోజనంలో దళితులకు వేరు వరుస, కరీంనగర్‌ జిల్లా సుల్తానాబాద్‌లో దళితుడిపై దాడి ఘటనలను ఆయన ఖండించారు. నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. దళితులపై ఎక్కడ, ఎవరి ద్వారా అన్యాయం జరిగినా మాదిగ హక్కుల దండోరా బాధితుల పక్షాన చట్టబద్ధంగా నిలబడుతుందని డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ తెలిపారు. కులం పేరుతో అవమానించడం, దాడి చేయడం, బెదిరించడం, భూములు ఆక్రమించడం వంటి అంశాలపై సంబంధిత అధికారులను ఆశ్రయించి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాజ్యాంగమే తమ ఆయుధమని, అన్యాయంపై రాజీ లేదని పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏనుమాములలో ఆధునిక ఫ్రూట్ మార్కెట్

ఏనుమాములలో ఆధునిక ఫ్రూట్ మార్కెట్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్ భవిష్యత్ అవసరాలకు...

నిమ్స్ అడిష‌న‌ల్‌ సూపరింటెండెంట్ ఇళ్ల‌ల్లో ఏసీబీ సోదాలు

నిమ్స్ అడిష‌న‌ల్‌ సూపరింటెండెంట్ ఇళ్ల‌ల్లో ఏసీబీ సోదాలు లక్ష్మీ భాస్కర్ ఆదాయానికి మించి...

రిమ్స్ పిల్ల‌ల వార్డులో పేలిన ఏసీ

రిమ్స్ పిల్ల‌ల వార్డులో పేలిన ఏసీ ఎస్‌ఎన్‌సీయూలో ఏసీ నుంచి ఒక్కసారిగా పొగలు ప్ర‌మాద...

ఐక్యతకు.. భక్తికి.. సంస్కృతికి ప్రతీక గణేశ్‌ నవరాత్రులు

ఐక్యతకు.. భక్తికి.. సంస్కృతికి ప్రతీక గణేశ్‌ నవరాత్రులు కులమతాలకు అతీతంగా ఒకే కుటుంబంగా...

రక్తదానం ప్రాణదానంతో సమానం

రక్తదానం ప్రాణదానంతో సమానం ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని బాధ్యతగా భావించాలి బీజేపీ రాష్ట్ర నాయకుడు...

తాడికల్ సర్పంచ్ దుర్గపు సుజాత కన్నుమూత

తాడికల్ సర్పంచ్ దుర్గపు సుజాత కన్నుమూత అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి.. ప్రముఖుల...

వర్ధన్నపేట సర్కారు దవాఖానాలో దారుణం..

వర్ధన్నపేట సర్కారు దవాఖానాలో దారుణం.. శవాన్ని పీక్కుతిన్న ఎలుకలు! ఫ్రీజర్ లేకపోవడమే కారణమా?...

యూపీఐ చార్జీల నుంచి ఎరువుల డీలర్లకు మినహాయింపు ఇవ్వాలి

యూపీఐ చార్జీల నుంచి ఎరువుల డీలర్లకు మినహాయింపు ఇవ్వాలి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలపై...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.