epaper
Friday, October 2, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రూ.205 కోట్లతో విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి చర్యలు

రూ.205 కోట్లతో విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి చర్యలు
గృహజ్యోతి లబ్ధిదారులకు రూ.40.19 కోట్ల సబ్సిడీ
4 సబ్‌స్టేషన్ల ఏర్పాటు.. సౌర విద్యుత్‌ పనులు వేగవంతం
రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కాకతీయ, ఏదులాపురం : పాలేరు నియోజకవర్గంలో విద్యుత్‌ సమస్యల సత్వర పరిష్కారానికి రూ.205 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం వరంగల్‌ క్రాస్‌రోడ్‌లోని తరుణీహట్‌ ప్రాంగణంలో టీజీఎన్‌పీడీసీఎల్‌ డివిజన్‌ కార్యాలయం, విద్యుత్‌ రెవెన్యూ కార్యాలయ భవనాన్ని కలెక్టర్‌ దివాకర టీఎస్‌, సీపీ సునీల్‌దత్‌తో కలిసి ప్రారంభించారు. వినియోగదారులకు అంతరాయం లేని విద్యుత్‌ సరఫరా కోసం 33 కేవీ ఇంటర్‌లింకింగ్‌ లైన్‌ ఫీడర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత 2 ఏళ్లలో 632 విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయించామని, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల్లో 4 సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పాలేరు నియోజకవర్గంలో గృహజ్యోతి లబ్ధిదారులకు రూ.40.19 కోట్ల సబ్సిడీ వర్తించినట్లు తెలిపారు. నేలకొండపల్లి మండలం చెరువు మాదారంలో 1,350 మంది గృహ వినియోగదారులకు రూ.15.66 కోట్లతో 2,709 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్‌ పలకల పనులు కొనసాగుతున్నాయన్నారు. రైతుల కోసం రూ.31.08 కోట్లతో సౌర విద్యుత్‌ సౌకర్య పనులు చేపట్టామని, అత్యవసర విద్యుత్‌ పునరుద్ధరణకు విద్యుత్‌ అంబులెన్స్‌ అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. కార్యక్రమంలో మద్దినేని స్వర్ణకుమారి, మధుసూదన్‌రావు, తమ్మినేని నవీన్‌, ఆళ్ల శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసచారి, నాగేశ్వరరావు, బానోత్‌ కిషోర్‌నాయక్‌, తోట వీరభద్రం, మద్ది మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అబద్ధాలు, విద్వేషాలతో సీఎం రేవంత్‌ కాలక్షేపం

అబద్ధాలు, విద్వేషాలతో సీఎం రేవంత్‌ కాలక్షేపం సిరిసిల్ల సభలో కేసీఆర్‌, కేటీఆర్‌పై దిగజారుడు...

మంత్రుల చుట్టూ.. ‘నాన్‌-లోకల్‌’ వలయం!

మంత్రుల చుట్టూ.. ‘నాన్‌-లోకల్‌’ వలయం! లోకల్‌ క్యాడర్‌కు అంద‌నంత దూరంగా మినిస్ట‌ర్లు అన్‌ప్రియారిటీగా మారుతున్న...

నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు క్రేన్లు, గజ ఈతగాళ్లు,...

సేవే శ్వాసగా.. పువ్వాడ కుటుంబం

సేవే శ్వాసగా.. పువ్వాడ కుటుంబం ఏళ్లుగా పేదల కోసం ఉచిత సేవా కార్యక్రమాలు పువ్వాడ...

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.