epaper
Tuesday, October 27, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష

తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష
వరంగల్‌ గడ్డ నుంచే మార్పు మొదలవ్వాలి
కాంగ్రెస్‌ అసమర్థ పాలనతో ప్రజలకు కష్టాలు
గ్రాడ్యుయేట్‌ ఓటరు నమోదుతో విజయానికి పునాది
40 వేల పట్టభద్రుల ఓట్ల నమోదే లక్ష్యం
: మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌

కాకతీయ, హనుమకొండ : తెలంగాణకు కేసీఆర్‌ నాయకత్వమే శ్రీరామరక్ష అని, కాంగ్రెస్‌ అసమర్థ పాలనతో రాష్ట్ర ప్రజలకు తాగునీరు, సాగునీరు, విద్యుత్‌ కష్టాలు ఎదురుకానున్నాయని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు, వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ విజయానికి ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో ఓటరు నమోదును వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. వరంగల్‌–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం హనుమకొండ స్నేహానగర్‌లోని ఎస్వీ కన్వెన్షన్‌లో మాజీ కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి అధ్యక్షతన వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ, గతంలో కేసీఆర్‌పై అసత్య ప్రచారంతో కాంగ్రెస్‌, బీజేపీ అధికారంలోకి వచ్చాయని విమర్శించారు. ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్‌ మాటలు నమ్మి మోసపోయామని గుర్తిస్తున్నారని అన్నారు.

40 వేల ఓట్ల నమోదే లక్ష్యం

గతంలో పట్టభద్రుల ఓట్లు 32 వేలు ఉండగా, రానున్న ఎన్నికల నాటికి 40 వేలకు పెంచేలా కృషి చేయాలని వినోద్‌కుమార్‌ సూచించారు. ఏ ఎన్నికల్లోనైనా బూత్‌ స్థాయి ఏజెంట్ల పాత్ర కీలకమని, ప్రతి పట్టభద్రుడిని కలిసి ఓటరుగా నమోదు చేయించాలని కోరారు. ఉద్యమాలకు కేంద్రబిందువైన వరంగల్‌ గడ్డ నుంచే రాబోయే రాజకీయ మార్పునకు పునాది పడాలని అన్నారు. మాజీ చీఫ్‌విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ, హనుమకొండలో 40 వేల మంది పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలన్నారు. పట్టభద్రుల స్థానాన్ని గెలిపించి కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు పునాది వేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ మూడేళ్ల పాలనలో కూల్చివేతలు, కేసులు, పథకాల ఎగవేతలు, కోతలు తప్ప సాధించిందేమీ లేదని విమర్శించారు. ప్రజల తరఫున పోరాడుతున్న బీఆర్ఎస్‌ నాయకులపై కేసులు పెడుతున్నారని అన్నారు.

సమష్టి కృషితోనే విజయం

బీఆర్ఎస్‌ రాష్ట్ర నాయకుడు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ, పట్టభద్రుల ఎన్నికలు సాధారణ ఎన్నికలకు భిన్నమైనవని, గతంలో స్వల్ప తేడాతో ఓటమి ఎదురైనా ఈసారి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే విజయం సాధించవచ్చన్నారు. అభ్యర్థి ఎవరైనా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కష్టపడాలని కోరారు. మాజీ చైర్మన్‌ డాక్టర్‌ కే. వాసుదేవరెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు బీఆర్ఎస్‌కు మద్దతుగా ఉన్నారని, పట్టభద్రుల ఓటరు నమోదును పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. ప్రొఫెసర్‌ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ పట్టభద్రులకు న్యాయం బీఆర్ఎస్‌తోనే సాధ్యమని, ఓటరు నమోదే ఎన్నికల్లో కీలకమని పేర్కొన్నారు. మాజీ కార్పొరేటర్‌ జోరిక రమేష్‌ మాట్లాడుతూ, పార్టీ తరఫున నమోదు చేయించిన పట్టభద్రుల వివరాలను కార్యాలయానికి అందించాలని సూచించారు. ఇప్పటికే డివిజన్ల వారీగా సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామని, నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కోరారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్లు, డివిజన్‌ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జులు, బూత్‌ స్థాయి ఏజెంట్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు

పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు రెండో విడతలో మరో 1,100 ఇందిరమ్మ ఇళ్లు పొలాల...

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర సానుకూలం!

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర సానుకూలం! 152 మీటర్ల ఎత్తు ప్రతిపాదనపై పునఃపరిశీలనకు సీఎం ఫ‌డ్న‌వీస్‌...

మెడికవర్‌పై ఉన్న శ్రద్ధ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులపై ఏదీ?

మెడికవర్‌పై ఉన్న శ్రద్ధ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులపై ఏదీ? 17 వేల మంది ఉద్యోగుల...

కాంగ్రెస్‌ తెచ్చిన కరువు!

కాంగ్రెస్‌ తెచ్చిన కరువు! దేవాదుల, కల్వకుర్తి నుంచి ఎందుకు నీళ్లు ఎత్తడం లేదు? తమ్మిడిహట్టి...

కరువును వదిలి ఢిల్లీ పర్యటనలా?

కరువును వదిలి ఢిల్లీ పర్యటనలా? ఖర్గే వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం ఓటర్ల ప్రత్యేక...

బౌద్ధ స్తూపానికి పూర్వ వైభవం!

బౌద్ధ స్తూపానికి పూర్వ వైభవం! అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా నేలకొండపల్లి 10 రోజుల్లో...

రేడియ‌ల్ రోడ్ టెండ‌ర్ల‌లో అక్ర‌మాలు

రేడియ‌ల్ రోడ్ టెండ‌ర్ల‌లో అక్ర‌మాలు రోడ్‌–2 ప్రాజెక్టులో ఆర్థిక అవకతవకలు జ‌రిగాయి బినామీల‌కు కాంట్రాక్ట‌ర్ల‌కు...

కన్నెపల్లి ర్యాంప్‌లో అద‌న‌పు వ‌సూళ్లు

కన్నెపల్లి ర్యాంప్‌లో అద‌న‌పు వ‌సూళ్లు కాసుల దందాకు టీజీఎండీసీ అధికారుల అండ! ఆదివారం ఒక్కో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.