epaper
Friday, November 13, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పస్రాలో పర్యావరణ సెస్ మాయం

పస్రాలో పర్యావరణ సెస్ మాయం
రూ.6.75 లక్షలు బ్యాంకులో జమ కాని వైనం
నివేదిక ఇచ్చినా నిద్రావస్థలో అటవీ శాఖ
ఆరు రోజుల వసూళ్లు మాయం
ప్రభుత్వ ఖజానాకు చేరని రూ.6.75 లక్షలు
బాధ్యుడైన అధికారిపై చర్యలు శూన్యం

కాక‌తీయ‌, నిఘా ములుగు: ములుగు జిల్లా పస్రా అటవీ చెక్‌పోస్టులో పర్యావరణ సెస్ వసూళ్ల వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ప్రజల నుంచి వసూలు చేసిన పర్యావరణ సెస్‌లో ఏకంగా రూ.6,75,350 బ్యాంకు ఖాతాలో జమ కాకపోవడం అటవీ శాఖ అధికారిక నివేదికలో వెలుగులోకి వచ్చింది. 2025 ఏప్రిల్ నెలలో చెక్‌పోస్టు ద్వారా మొత్తం రూ.28,90,400 వసూలు కాగా, అందులో రూ.20,94,050 మాత్రమే బ్యాంకులో జమ చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. మరో రూ.1,21,000 నగదు రూపంలో ఉన్నట్లు వివరించారు. మిగిలిన రూ.6,75,350 మాత్రం ఏప్రిల్ 21, 24, 25, 27, 29, 30 తేదీల్లో వసూలైనప్పటికీ బ్యాంకులో జమ కాలేదని తేదీల వారీగా లెక్కలతో సహా నివేదికలో పొందుపరిచారు. సంబంధిత మొత్తాన్ని మే 5లోగా బ్యాంకులో జమ చేయాలని ఆదేశించినట్లు కూడా నివేదికలో ప్రస్తావించారు. ఆరు రోజుల వసూళ్లకు సంబంధించిన లక్షల రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ కాకపోవడం ప్రభుత్వ ఆదాయ నిర్వహణపై తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది.

అధికారిక నివేదిక బహిర్గతం.. బాధ్యుడిపై చర్యలు మాత్రం శూన్యం

రూ.6.75 లక్షల నగదు బ్యాంకులో జమ కాలేదని అటవీ శాఖలోనే అధికారిక నివేదిక సమర్పించినప్పటికీ, ఇప్పటివరకు ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంబంధిత బీట్ అధికారి విధుల్లో కొనసాగుతుండటం మరింత వివాదానికి దారితీస్తోంది. ఇంతటి ఆర్థిక వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా సంబంధిత అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలు స్పష్టంగా లేవు. నిధుల జమలో జరిగిన లోపాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టారా, సంబంధిత వ్యక్తి నుంచి వివరణ తీసుకున్నారా, వసూళ్ల రికార్డులు, బ్యాంకు లావాదేవీలను సరిపోల్చారా అనే అంశాలపై అటవీ శాఖ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అధికారిక నివేదిక ఉన్నప్పటికీ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి విధులు కొనసాగించడం, చర్యలపై సమాచారం లేకపోవడం ఉన్నతాధికారుల పర్యవేక్షణ తీరుపై విమర్శలకు కారణమవుతోంది.

చర్యలు తీసుకోవాల్సిన అధికారుల మౌనం.. అనుమానాలకు తావిస్తున్న తీరు

ప్రభుత్వ ఆదాయానికి సంబంధించిన రూ.6,75,350 నిధులు బ్యాంకులో జమ కాలేదని అధికారిక నివేదికలో వెల్లడైనప్పటికీ, చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతటి తీవ్రమైన ఆర్థిక వ్యవహారం వెలుగులోకి వచ్చినా బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి ఇప్పటికీ విధుల్లో కొనసాగుతుండటం అనేక సందేహాలకు తావిస్తోంది. నివేదిక అందిన తర్వాత కూడా విచారణ, క్రమశిక్షణ చర్యల విషయంలో ఎందుకు జాప్యం జరుగుతోందన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల మౌనం వెనుక కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపట్టి, నిధుల లెక్క తేల్చడంతో పాటు బాధ్యులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సాఫ్ట్‌బాల్‌ క్రీడలో సత్తా చాటాలి

సాఫ్ట్‌బాల్‌ క్రీడలో సత్తా చాటాలి రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ నిరూపించుకోవాలి కరీమాబాద్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు...

ఘనంగా సింగపురం ఇందిరా జన్మదిన వేడుకలు!

ఘనంగా సింగపురం ఇందిరా జన్మదిన వేడుకలు! క్యాంపు కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి...

తమ్ముడిని హత్య చేసిన అన్నకు జీవిత ఖైదు!

తమ్ముడిని హత్య చేసిన అన్నకు జీవిత ఖైదు! వరంగల్‌ ప్రధాన జిల్లా న్యాయస్థానం...

ఉద్యమకారుల హక్కుల సాధనకు మరో ఉద్యమం!

ఉద్యమకారుల హక్కుల సాధనకు మరో ఉద్యమం! రేపు హనుమకొండలో రెండో దశ ఉద్యమకారుల...

పీఎం రాహత్‌ పథకం అమలులో నిర్లక్ష్యం వద్దు

పీఎం రాహత్‌ పథకం అమలులో నిర్లక్ష్యం వద్దు రోడ్డు ప్రమాద బాధితులకు నగదు...

ఐఎల్‌పీఏ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి!

ఐఎల్‌పీఏ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి! నవంబర్‌ 14న హనుమకొండలో ఆరో రాష్ట్ర...

తరగతి గదుల నుంచి ఆసుపత్రి వరకు

తరగతి గదుల నుంచి ఆసుపత్రి వరకు ఐటీడీఏ పీఓ క్షేత్రస్థాయి పరిశీలన రైనిగూడెం ఆశ్రమ...

దొడ్ల కొత్తూరులో భారీగా నాటుసారా నిల్వలు

దొడ్ల కొత్తూరులో భారీగా నాటుసారా నిల్వలు పోలీసుల కార్డన్‌ సెర్చ్‌లో 4 వేల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.