epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మహాత్మా నగర్‌లో శ్రీ అయ్యప్ప స్వామి ప్రతిష్ఠ

మహాత్మా నగర్‌లో శ్రీ అయ్యప్ప స్వామి ప్రతిష్ఠ
21 నుంచి మహోత్సవాలు

కాకతీయ, కరీంనగర్ : తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ (ఎల్‌ఎండి) గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి పుణ్యక్షేత్ర ప్రతిష్ఠా మహోత్సవాల సందడి మొదలైంది. ఈ నెల 21 నుండి 23 వరకు అంగరంగ వైభవంగా జరగనున్న మహాకుంభాభిషేక, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలకు దేవాలయ ప్రాంగణం భక్తజనంతో కోలాహలంగా మారనుంది. అయ్యప్ప, గణపతి, సుబ్రహ్మణ్య, నాగేంద్ర, పార్వతీదేవి, నవగ్రహ, శిఖరధ్వజ సహా వివిధ దేవతామూర్తుల ప్రతిష్ఠ కోసం అన్ని ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి.హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామివారు స్వయంగా ఈ మహోత్సవాలకు విచ్చేసి యంత్ర ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, కళాన్యాసం, మహాకుంభాభిషేకం వంటి ప్రధాన కార్యక్రమాలను నిర్వహించనుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. 21వ తేదీ ఉదయం మంగళవాయిద్యాలు, చతుర్వేద స్వస్తివచనాలతో మహోత్సవాలు ప్రారంభంకానున్నాయి. యజ్ఞశాల ప్రవేశం, హోమకుండ సంస్కారం, నవగ్రహ మాతృక దేవతా స్థాపన, అగ్ని ప్రతిష్ఠలతో తొలి రోజు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. సాయంత్రం గణపతి, నవగ్రహ, ప్రధాన దేవతామూర్తుల వాసపూర్వక జలాధివాసం, హారతి, తీర్థప్రసాదాలు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి.22వ తేదీన స్థాపిత దేవతా పూజలు, వాస్తు యోగిని క్షేత్రపాలక దేవతల హవనాలు, మూలమంత్ర హోమాలు, సాయంత్రం రుద్రహవనం, మహాస్నపనం, శయ్యాదివాస, పుష్పాదివాస వంటి పరంపరాగత కార్యక్రమాలు జరగనున్నాయి. 23వ తేదీ ఆదివారం ఉదయం నుంచి బ్రహ్మశిల సంస్కారం, రత్న దాతు బీజన్యాసాలు నిర్వహించి, మకర లగ్నంలోని శుభ ముహూర్తం ఉదయం 10.20 గంటలకు ప్రధాన ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. అనంతరం జయాది హోమం, పూర్ణాహుతి, మహాకుంభాభిషేకం, అలంకరణ, హారతులు వైభవోపేతంగా నిర్వహించనున్నారు. సాయంత్రం మహా పడిపూజ అనంతరం అన్నప్రసాద విందు ఏర్పాటు చేశారు.కులం, మతం, జాతి అన్న భేదాలు లేని అయ్యప్ప దీక్ష మహిమను అన్ని వర్గాలకు చేర్చే దిశగా ఈ కొత్త అయ్యప్ప దేవాలయం భక్తులకు ఓ దివ్యక్షేత్రంగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. గురు స్వామి కావేటి పరమేశ్వర స్వామి పర్యవేక్షణలో జరగుతున్న ఈ ప్రతిష్టాపన మహోత్సవాల్లో సమస్త హిందూ బంధువులు, అయ్యప్ప భక్తులు సకుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారి దివ్యకరుణ పొందాలని దేవాలయ కమిటీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.