epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కొండగట్టు భూములు అంజన్నకే చెందాలి

కొండగట్టు భూములు అంజన్నకే చెందాలి
ఫారెస్ట్ మార్కింగ్‌తో ఆలయ అభివృద్ధికి ఆటంకం
ఈవో అనుమతి లేకుండా హద్దులు తగదు
గిరి ప్రదక్షిణ భక్తులకు ఇబ్బందులు
కలెక్టర్‌కు విహెచ్‌పీ వినతిపత్రం

కాకతీయ, జగిత్యాల : జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి సంబంధించిన భూములు పూర్తిగా దేవస్థానానికే చెందాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందూ పరిషత్‌ (విహెచ్‌పీ) ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆలయ భూములను ఫారెస్ట్ భూములుగా గుర్తిస్తూ అధికారులు చేస్తున్న మార్కింగ్‌ వల్ల ఆలయ అభివృద్ధి పనులకు తీవ్ర ఆటంకాలు కలుగుతున్నాయని విహెచ్‌పీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విహెచ్‌పీ రాష్ట్ర గోశాల సంపర్క్ ప్రముఖ్ ఉట్కూరి రాధాకృష్ణ రెడ్డి మాట్లాడుతూ, శతాబ్దాల చరిత్ర కలిగిన కొండగట్టు ఆలయానికి చెందిన భూములపై ఫారెస్ట్ అధికారులు ఏకపక్షంగా మార్కింగ్ చేయడం సరికాదన్నారు. ఆలయ ఈవో అనుమతి లేకుండా దేవభూముల చుట్టూ హద్దులు ఏర్పాటు చేయడం తగదని స్పష్టం చేశారు. వెంటనే ఈ మార్కింగ్‌ను తొలగించి ఆలయ అభివృద్ధికి అనుకూలంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆలయ అభివృద్ధికి ఆటంకాలు
కొండగట్టు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోందని, ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తారని విహెచ్‌పీ నేతలు తెలిపారు. అలాంటి ఆలయానికి సంబంధించిన భూములను ఫారెస్ట్ భూములుగా చూపడం వల్ల రహదారులు, వసతి సౌకర్యాలు, భక్తుల కోసం చేపట్టాల్సిన అభివృద్ధి పనులు నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. దేవస్థాన భూములన్నీ ఆలయ అభివృద్ధికే వినియోగించేలా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

భక్తులకు ఇబ్బందులు – చర్యలు కావాలి
అలాగే గిరి ప్రదక్షిణ చేసే భక్తులను కొందరు ఇబ్బందులకు గురిచేస్తున్నారని విహెచ్‌పీ నేతలు వినతిపత్రంలో పేర్కొన్నారు. భక్తుల స్వేచ్ఛాయుత దర్శనానికి, ప్రదక్షిణకు ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫారెస్ట్ అధికారులు మార్కింగ్ చేసిన భూములన్నీ ఆలయ అభివృద్ధికి ఉపయోగపడేలా దేవస్థానానికే చెందే విధంగా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
వినతిపత్రానికి స్పందించిన జిల్లా కలెక్టర్, కొండగట్టు ఆలయ అభివృద్ధికి అవసరమైతే అదనంగా భూములు సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే ఆలయ భూములను ఇతరులకు అప్పగించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఆలయ ఈవో, డీఎఫ్ఓ, ఆర్డీఓలకు కూడా వినతిపత్రం అందజేయగా, భూములన్నీ ఆలయ అభివృద్ధి కోసమే వినియోగిస్తామని వారు భరోసా ఇచ్చినట్లు విహెచ్‌పీ నేతలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు బోయినిపెల్లి పద్మాకర్, జిల్లా కార్యదర్శి కస్తూరి రాజన్న, జిల్లా కోశాధికారి మామిడాల రాములు, జిల్లా సహ కార్యదర్శి గాజోజు సంతోష్ కుమార్, జగిత్యాల నగర అధ్యక్షుడు జిట్టవేణి అరుణ్, కార్యదర్శి వడ్లగట్ట భూమేష్, ఎదురుగాట్ల పరంధాం, అనుపురం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.