epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నూతన సర్పంచ్‌లకు ఘన సన్మానం

నూతన సర్పంచ్‌లకు ఘన సన్మానం
గ్రామస్థాయిలో కాంగ్రెస్‌కు బలమైన పునాది వేయాలి
: మంత్రి పొన్నం ప్రభాకర్

కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇటీవల ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లకు డీసీసీ కార్యాలయం ఇందిరా భవన్‌లో శుక్రవారం ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై నూతన సర్పంచ్‌లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ బలమురి వెంకట్, సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, హుజూరాబాద్ ఇన్‌చార్జి ఓడితల ప్రణవ్, మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణ, ఆరేపల్లి మోహన్‌తో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు.

గ్రామస్థాయిలో కాంగ్రెస్‌కు పునాది వేయాలి..

కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్‌లు గ్రామాల్లో పార్టీ ప్రతినిధులుగా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ గ్రామ సమస్యలను పరిష్కరించడమే సర్పంచ్‌ల ప్రధాన కర్తవ్యమని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు చివరి వ్యక్తి వరకు చేరేలా చూడాలని, కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవాలని కోరారు. ఎన్నికల కారణంగా నిలిచిపోయిన నిధులు త్వరలో విడుదలవుతాయని, ముఖ్యమంత్రి గ్రామాల అభివృద్ధికి తగిన నిధులు కేటాయిస్తారని హామీ ఇచ్చారని తెలిపారు. వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, శానిటేషన్‌, వీధి దీపాలు, హరితహారం, మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సర్పంచ్‌లు కృషి చేయాలని, ప్రతి పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలలోనే చదివేలా చూడాలని పిలుపునిచ్చారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను గ్రామస్థాయిలో ప్రజలకు వివరించాలని అన్నారు. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. ఈనెల 28న గాంధీ విగ్రహాల వద్ద, ఉపాధి హామీ పనుల ప్రాంతాల్లో గాంధీ చిత్రాలతో నిరసనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ ఐక్యంగా పనిచేయాలని, గెలిచిన వారితో పాటు ఓడిన అభ్యర్థులను కూడా కలుపుకొని ముందుకు సాగుతామని మంత్రి స్పష్టం చేశారు. చివరగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు ముఖ్యమంత్రి, పీసీసీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.