epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఖమ్మం మంత్రులు ముగ్గురిదీ కమీషన్ల కక్కుర్తే

ఖమ్మం మంత్రులు ముగ్గురిదీ కమీషన్ల కక్కుర్తే

జేబులు నింపుకోవడమే తప్ప జిల్లాకు పనికొచ్చే పనులు చేయట్లే..

సీతారామసాగర్‌ ప్రాజెక్టును గాలికి వ‌దిలేసిండ్రు

బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో 90 శాతం పనులను పూర్తిచేశాం

రెండేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసింది శూన్యం

ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలతోనే స‌రి

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌

ఖ‌మ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌లకు ఆత్మీయ స‌న్మానం

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఖమ్మం జిల్లా అభివృద్ధికి చేసిందేమీ లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ విమర్శించారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఇక్కడి ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌లతో ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్‌ మాట్లాడారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈసంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నాడు ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడం కోసం కేసీఆర్ సీతారామసాగర్‌ ప్రాజెక్టును నిర్మించతలపెట్టి 90 శాతం పనులను పూర్తిచేశారని గుర్తుచేశారు. ఖమ్మం జిల్లాలో 7.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని, గోదావరి జలాలపై పూర్తి హక్కులు ఖమ్మం జిల్లాకే దక్కాలని నాడు కేసీఆర్ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని విమర్శించారు.

ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కమీషన్‌లకు కక్కుర్తిపడి ప్రాజెక్టును పక్కనపెట్టారని మండిపడ్డారు. ఆ ముగ్గురు మంత్రులు ప్రజలకు మేలు చేయగల మొనగాళ్లు కాదని, మోసగాళ్లని కేటీఆర్‌ విమర్శించారు. వారు 30 శాతం చొప్పున కమీషన్‌లు వసూలు చేసి జేబులు నింపుకోవడమే తప్ప జిల్లాకు పనికొచ్చే పనులు ఒక్కటి కూడా చేయడంలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల సమయంలో ఈస్ట్‌మన్ కలర్‌లో సినిమా చూపెట్టారని, ఇదిస్తాం.. అదిస్తాం అని నోటికొచ్చిన హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఏదీ ఇవ్వలేదని విమర్శించారు. అశ్వారావుపేటలో ఒక్క సీతారామసాగర్‌ ప్రాజెక్టు ద్వారా 1.30 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేలా కేసీఆర్‌ డిజైన్‌ చేశారని కేటీఆర్ చెప్పారు. సత్తుపల్లి నియోజకవర్గంలో 40 వేల ఎకరాలకు, ఇల్లందు నియోజకవర్గంలో 20 వేల ఎకరాలకు, కొత్తగూడెంలో 10 వేల ఎకరాలకు, వైరాలో 20 వేల ఎకరాలకు నీళ్లిచ్చేలా కేసీఆర్ సీతారామ ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. కానీ ఆ ప్రాజెక్టును ప్రభుత్వం పక్కనపెట్టింది. ఈ రెండేళ్లలో ప్రభుత్వం చేసింది ఏమైనా ఉందంటే.. అది ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలేని, కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.