epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం
అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి
జీవో–252లో మార్పులు, సూచనలకు స్వాగతం
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : జర్నలిజం గౌరవాన్ని నిలబెట్టే పాత్రికేయులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అక్రిడిటేషన్ కార్డులు తగ్గుతాయన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, గతంలో కంటే ఎక్కువగానే ఈసారి అక్రిడిటేషన్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. శనివారం సచివాలయంలో తన కార్యాలయంలో 14 జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో జీవో–252పై మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టు సంఘాలు చేసిన సూచనలు, విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలించి జీవో–252లో అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తామని హామీ ఇచ్చారు. అక్రిడిటేషన్ కార్డుల జారీ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందువరుసలో ఉందన్నారు.

ఏ కార్డుకైనా అన్ని ప్రయోజనాలు

మీడియా కార్డు, అక్రిడిటేషన్ కార్డు మధ్య ఎలాంటి తేడా లేదని, అక్రిడిటేషన్ కార్డుదారులకు లభించే అన్ని ప్రభుత్వ ప్రయోజనాలు మీడియా కార్డుదారులకు కూడా వర్తిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. అసలైన పత్రికలు, నిజమైన జర్నలిస్టులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో సర్క్యులేషన్ వివరాలు, ఛార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫికేట్లను పరిశీలిస్తున్నామని తెలిపారు. జనాభా ప్రాతిపదికన అక్రిడిటేషన్ల మంజూరుపై ఆలోచన చేస్తున్నామని, ఉర్దూ జర్నలిస్టులకు కమిటీల్లో అవకాశం కల్పిస్తామని చెప్పారు. క్రీడలు, సంస్కృతి, క్రైమ్‌, కేబుల్ టీవీ విభాగాల జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్ సౌకర్యం ఉంటుందని, మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక కోటా కేటాయిస్తామని వెల్లడించారు. డిజిటల్ మీడియా కార్డులు దేశంలో తొలిసారిగా తెలంగాణలోనే జారీ చేశామని గుర్తు చేశారు.

జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు కొత్త విధానం

జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశంపై స్పందించిన మంత్రి, కోర్టు అడ్డంకులు లేని విధానాన్ని రూపొందిస్తామని చెప్పారు. ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకువస్తుందన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి, ఐ&పిఆర్ కమిషనర్ సిహెచ్‌. ప్రియాంక, సీపీఆర్‌వో జి. మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.