epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పసికందును అన్యాయంగా చంపేశారు!

పసికందును అన్యాయంగా చంపేశారు!
డాక్టర్ నిర్లక్ష్యంతో మృతి చెందిందంటూ బంధువుల ఆరోప‌ణ‌
గణేష్ నర్సింగ్ హోమ్‌లో ఘ‌ట‌న‌
ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన
డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఉమ్మనీరు మింగ‌డంతో మృతి : డాక్టర్ బాసంతి

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : తొలి కాన్పుతో ఆనందంగా ఉన్న ఓ కుటుంబాన్ని విషాదం ముంచెత్తింది. పండంటి మగబిడ్డకు జన్మనిస్తుందని ఆశించిన తల్లిదండ్రులకు తీవ్ర గర్భశోకం మిగిల్చిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. గణేష్ నర్సింగ్ హోమ్ మెటర్నిటీ జనరల్ హాస్పిటల్‌లో డాక్టర్ నిర్లక్ష్యం వల్లే పసికందు చనిపోయిందని ఆరోపిస్తూ తల్లిదండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం పంచాయతీ రాజు తండాకు చెందిన సుస్మిత–అశోక్ కుమార్లకు ఇది తొలి కాన్పు. గర్భధారణ మొదటి నుంచే సుస్మితను కొత్తగూడెంలోని గణేష్ నర్సింగ్ హోమ్‌లో చేర్పించి వైద్య చికిత్సలు అందించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రతిరోజూ పరీక్షలు, స్కానింగ్‌లు చేసి పసికందు ఆరోగ్యం బాగుందని వైద్యురాలు భరోసా ఇచ్చిందని చెప్పారు.

డెలివరీ ఆలస్యం.. విషాదం

డెలివరీ తేదీగా సోమవారం నిర్ణయించడంతో ఉదయం 10 గంటలకే ఆసుపత్రికి వచ్చామని, అయినా సాయంత్రం వరకూ వేచి చూడాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు వాపోయారు. చివరకు డెలివరీ చేసినప్పుడు పుట్టిన ఐదు నిమిషాలకే పసికందు మృతి చెందాడని, ఇది పూర్తిగా డాక్టర్ నిర్లక్ష్యమేనని ఆరోపించారు. వైద్యరంగంలో అనుభవం ఉన్న డాక్టర్ ఇలాంటి నిర్లక్ష్యం ఎలా చేస్తారని ప్రశ్నిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఉమ్మనీరు మింగ‌డంతో మృతి : డాక్టర్ బాసంతి

ఈ ఘటనపై గైనకాలజిస్ట్ డాక్టర్ బాసంతి స్పందించారు. సుస్మితను ఆపరేషన్ ద్వారా డెలివరీ చేశామని, అప్పటికే పసికందు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తెలిపారు. పుట్టిన మగశిశువు ఉమ్మనీరు (అమ్నియోటిక్ ఫ్లూయిడ్)తో పాటు మలాన్ని మింగడంతో పేగులకు అడ్డుపడి, ఊపిరితిత్తులు గట్టిగా మారి శ్వాసకోస సమస్యలు తలెత్తాయని చెప్పారు. అదే కారణంగా పసికందు మృతి చెందినట్లు వివరణ ఇచ్చారు. అయితే, ఈ వివరణను తల్లిదండ్రులు ఖండిస్తున్నారు. పసికందు మృతి తర్వాత వైద్యురాలు నిర్లక్ష్యంగా సమాధానాలు ఇచ్చిందని, కావాలనే తమ బిడ్డను చంపేశారంటూ వారు కన్నీరు మున్నీరు అయ్యారు. తొలి కాన్పులోనే గర్భశోకం మిగిలిన ఈ ఘటనపై అధికారులు ఎలా స్పందిస్తారో, బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.