epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఉపాధి హక్కుపై కేంద్రం కత్తి!

ఉపాధి హక్కుపై కేంద్రం కత్తి!
విబిజి రాంజీ చట్టం రద్దు చేయాలి
ఖమ్మంలో కాంగ్రెస్ నగర్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన

కాకతీయ, ఖమ్మం : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (మన్‌రేగా) తక్షణమే పునరుద్ధరించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విబిజి రాంజీ (వికాస్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్) చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నగర్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మం నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. 43, 44, 45, 49వ డివిజన్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట సమావేశమై కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి మాట్లాడుతూ… ప్రజలకు ఉపాధి హక్కు, పంచాయతీల పాలన హక్కును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. గ్రామపంచాయతీలకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన అధికారాలను నిర్వీర్యం చేస్తూ, మన్‌రేగాను బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందన్నారు. మన్‌రేగా స్థానంలో తీసుకొచ్చిన విబిజి రాంజీ చట్టం గ్రామీణ ప్రజల జీవితాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని, ఇది ఉపాధి హక్కును హరించే ప్రమాదకరమైన విధానమని విమర్శించారు. ఈ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తిరస్కరిస్తోందని స్పష్టం చేశారు.

రాష్ట్రాలపై ఆర్థిక భారం

గతంలో మన్‌రేగా పనులకు సంబంధించిన వేతనాలు 100 శాతం కేంద్ర ప్రభుత్వం నుంచే వచ్చేవని, ఇప్పుడు కేంద్రం కేవలం 60 శాతం మాత్రమే భరిస్తూ మిగతా 40 శాతం భారం రాష్ట్ర ప్రభుత్వాలపై మోపుతోందని దీపక్ చౌదరి తెలిపారు. దీని వల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం పెరిగి, నిధుల కొరత, వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరిగే ప్రమాదం ఉందన్నారు. ఇది గ్రామీణ కార్మికుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, కేంద్రం తన బాధ్యత నుంచి తప్పించుకుంటోందని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు కొత్త సీతారాములు, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార్, డీ-బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలగంగా తిలక్, నరాల నరేష్, పాలపు వెంకటరమణ, గుడిపూడి జగదీష్, కార్పొరేటర్ దుద్దుకూరి వెంకటేశ్వర్లు, కాంపటి వెంకన్న, బాణాల లక్ష్మణ్, ఎండీ ఫజల్, ఐఎన్‌టీయూసీ నాయకులు విప్లవ్ కుమార్, అనంత లక్ష్మి, ఎదునుతల ప్రభాకర్, గండం వెంకటయ్య, బోపురి నరేందర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.