epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్‌ను నిలదీయండి

ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్‌ను నిలదీయండి
మాయమాటలు నమ్మి మరోసారి మోసపోవద్దు
మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్, ఎమ్మెల్సీ రవీందర్ రావు పిలుపు

కాకతీయ, హుస్నాబాద్ : హుస్నాబాద్ పట్టణం నిజంగా అభివృద్ధి చెందాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కారు గుర్తుకు ఓటు వేయాలని మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని 6, 7, 8, 18, 19 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ వారు ఓటర్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ప్రజలు ఆ పార్టీ నాయకులను నేరుగా ప్రశ్నించాలని సూచించారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మొండిచేయి చూపిందని విమర్శించారు. “ఒకసారి కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోయాం. మరోసారి ఆ తప్పు చేయొద్దు” అని వారు ప్రజలకు హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో గారడీ మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని, ఆ మాటలను నమ్మి ఓటేయొద్దని స్పష్టం చేశారు.

మంత్రి పొన్నంపై తీవ్ర విమర్శలు

మంత్రి పొన్నం ప్రభాకర్‌పై విమర్శలు గుప్పిస్తూ, ఆయనకు మాటలు చెప్పడం తప్ప అభివృద్ధి పనులు చేయడం చేతకాదని అన్నారు. హుస్నాబాద్‌లో నిజంగా అభివృద్ధి జరిగి ఉంటే మంత్రి ఇంటింటికి తిరిగి ఓట్లు ఎందుకు అడుగుతారని ప్రశ్నించారు. అభివృద్ధి జరిగితే ప్రజలే స్వచ్ఛందంగా ఓట్లు వేస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రూ.2500 భృతి, తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు వంటి హామీలు ఇప్పటివరకు అమలు చేయలేదని గుర్తు చేశారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను ఈ హామీలపై నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచి పాలకమండలి ఏర్పడితేనే పట్టణ అభివృద్ధి వేగవంతం అవుతుందని వారు తెలిపారు. ప్రజల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు గట్టిగా బుద్ధి చెబితేనే ఆరు గ్యారెంటీలు అమలు కావడానికి ఒత్తిడి పెరుగుతుందని పేర్కొన్నారు. మాట తప్పిన కాంగ్రెస్‌కు సరైన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. “హుస్నాబాద్ అభివృద్ధికి బీఆర్ఎస్ మాత్రమే సరైన ప్రత్యామ్నాయం. కారు గుర్తుకు ఓటు వేసి పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి” అని సతీష్ కుమార్, రవీందర్ రావు ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆయా వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థులు, స్థానిక పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.