epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

లేబర్ కోడ్‌ల రద్దు వరకు పోరాటం ఆగదు

లేబర్ కోడ్‌ల రద్దు వరకు పోరాటం ఆగదు
కొత్తగూడెంలో కార్మిక సంఘాల జేఏసీ భారీ ప్రదర్శన
చుంచుపల్లి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా
కార్మిక–కర్షక ఐక్య పోరాటానికి నాయకుల పిలుపు

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : కార్మిక హక్కుల సాధన కోసం, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెంలో కార్మిక వర్గం పెద్దఎత్తున కదిలింది. కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం భారీ ప్రదర్శన నిర్వహించి చుంచుపల్లి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. స్థానిక పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి ప్రారంభమైన ప్రదర్శన రామాలయం మీదుగా ఎమ్మార్వో కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న నాలుగు లేబర్ కోడ్‌లు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మికులు, రైతులు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

కార్మిక–కర్షక ఐక్యతే బలం

సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర నేతలు సాదినేని వెంకటేశ్వరరావు, మచ్చ వెంకటేశ్వర్లు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బి. మధు, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర నాయకులు జలీల్, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకులు సీతారామయ్య, ఐఎఫ్‌టీయూ నాయకులు కందగట్ల సురేందర్, టీజేఎస్ నాయకులు బాబు తదితరులు మాట్లాడుతూ కార్మిక హక్కులను హరించే విధానాలను తిప్పికొట్టేందుకు ఐక్య పోరాటం తప్ప మరో మార్గం లేదన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను కట్టు బానిసలుగా మార్చే ప్రయత్నంగా ఈ లేబర్ కోడ్‌లు ఉన్నాయని విమర్శించారు. కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న ఈ చట్టాలను అమలు చేయాలనుకుంటే కార్మిక–కర్షక ఐక్య శక్తితో తీవ్ర ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. నాలుగు లేబర్ కోడ్‌లను పూర్తిగా రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు కే. బ్రహ్మచారి, మల్లెల రామనాథం, సంజీవ్, భూక్య రమేష్, నాగభూషణం, రాజేష్, బాలరాజు, నగేష్, సక్రం, పాషా, కళావతి, శైలజ, రేష్మ, దుర్గమ్మ, గంగ, నిహారిక, రాములు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.