epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఖమ్మంలో కాంగ్రెస్ దూకుడు..!

ఖమ్మంలో కాంగ్రెస్ దూకుడు..!
వైరా, ఏదులాపురంలో కాంగ్రెస్ ఖాతా ఓపెన్‌
కల్లూరు, అశ్వారావుపేటలో హోరాహోరీ పోటీ
కొత్తగూడెం కార్పొరేషన్ ఫలితాలపై ఉత్కంఠ

కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రారంభ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతున్నాయి. పూర్తి ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు వచ్చిన ట్రెండ్ ప్రకారం పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యం సాధిస్తూ ముందంజలో నిలుస్తున్నారు. కీలక పట్టణాల్లో వరుస విజయాలు నమోదు చేయడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కొత్త‌గూడెం కార్పోరేష‌న్‌లో ఉత్కంఠ కొన‌సాగుతోంది

వైరా మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ రెండు వార్డుల్లో విజయం సాధించి ముందంజలో ఉంది. అదే విధంగా ఏదులాపురం మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు వరుస విజయాలు నమోదు చేస్తూ ఆధిక్యం కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు రెండు వార్డులు కాంగ్రెస్ ఖాతాలో చేరగా, మరికొన్ని వార్డుల్లో కూడా ఆధిక్యం కొనసాగుతోంది.

కల్లూరు, అశ్వారావుపేటలో హోరాహోరీ పోటీ

కల్లూరు మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకు కౌంటింగ్ కొనసాగుతుండగా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ రెండు వార్డులు, బీఆర్ఎస్ పార్టీ ఒక వార్డు గెలుచుకున్నాయి. మిగిలిన వార్డుల్లో పోటీ తీవ్రంగా కొనసాగుతోంది. ముందుగా బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉంటుందని భావించిన ఈ మున్సిపాలిటీలో తాజా ఫలితాలు కాంగ్రెస్‌కు కూడా అవకాశాలు ఉన్నట్లు సూచిస్తున్నాయి. అశ్వారావుపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇప్పటివరకు కాంగ్రెస్ రెండు వార్డులు, బీఆర్ఎస్ రెండు వార్డులు గెలుచుకోగా, బీజేపీ ఒక వార్డులో విజయం సాధించింది. మిగిలిన వార్డుల్లో కూడా తక్కువ ఓట్ల తేడాతో పోటీ కొనసాగుతుండటంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన పూర్తి ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యం సాధించగా, సీపీఐ రెండో స్థానంలో కొనసాగుతోంది. మొదటి రౌండ్ ఫలితాల కోసం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ప్రారంభ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. అయితే మిగిలిన వార్డుల ఫలితాలు వెలువడిన తర్వాతే తుది ఫలితాలపై స్పష్టత రానుంది. ప్రస్తుతం అన్ని మున్సిపాలిటీల్లో కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.