epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ దూకుడు

మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ దూకుడు
18 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం
5 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న బీఆర్‌ఎస్
కొన్ని చోట్ల ఇంకా కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియ
కార్పొరేషన్ల ఫలితాల కోసం కొనసాగుతున్న ఉత్కంఠ

కాకతీయ, తెలంగాణ‌ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ పార్టీ దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన పూర్తి ఫలితాలు వెలువడగా, మరికొన్ని చోట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధిక సంఖ్యలో మున్సిపాలిటీలను కైవసం చేసుకుని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. అదే సమయంలో బీఆర్‌ఎస్ కూడా కొన్ని మున్సిపాలిటీల్లో విజయాలు నమోదు చేసి తన స్థానం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

కాంగ్రెస్ ఖాతాలో 18 మున్సిపాలిటీలు

ప్రస్తుతం వరకు ప్రకటించిన అధికారిక ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ మొత్తం 18 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. కొడంగల్, నందికొండ, హాలియా, చందూరు, చిట్యాల, దేవరకొండ, ఇల్లందు, అశ్వారావుపేట, మధిర, చొప్పదండి, హుజూర్‌నగర్, బిచ్కుంద, సుల్తానాబాద్, ఎల్లారెడ్డి, దోర్నకల్, నేరేడ్‌చర్ల, నారాయణఖేడ్, బాన్సువాడ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించింది. ఈ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అధిక సంఖ్యలో వార్డులను గెలుచుకుని మున్సిపాలిటీలపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దీంతో పట్టణ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు బలంగా ఉన్నట్లు ఈ ఫలితాలు సూచిస్తున్నాయి.

బీఆర్‌ఎస్ ఖాతాలో 5 మున్సిపాలిటీలు

ఇక బీఆర్‌ఎస్ పార్టీ కూడా కొన్ని మున్సిపాలిటీల్లో విజయాలు నమోదు చేసింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, సంగారెడ్డి జిల్లా ఇందూర్, గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీలను బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. ఈ ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు కూడా స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందారు. ముఖ్యంగా కొన్ని మున్సిపాలిటీల్లో భారీ మెజారిటీతో విజయం సాధించడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
మొత్తంగా ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ 18 మున్సిపాలిటీలను, బీఆర్‌ఎస్ పార్టీ 5 మున్సిపాలిటీలను తమ ఖాతాలో వేసుకున్నాయి. ఇంకా కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కౌంటింగ్ కొనసాగుతుండటంతో తుది ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. పూర్తి ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్రంలోని పట్టణ రాజకీయ పరిస్థితులపై స్పష్టత రానుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.