epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రేషన్ డీలర్ బెదిరింపులు!

రేషన్ డీలర్ బెదిరింపులు!
కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత కొత్తగూడెంలో ఉద్రిక్తత
ఓటమి చెందిన అభ్యర్థి బంధువుల బూతు పురాణం
“రేషన్ ఎలా తీసుకుంటారో చూస్తా” అంటూ ఓటర్లకు దంకీలు
ప్రజలకు సేవ చేయాల్సిన డీలర్ బెదిరింపులపై ఆగ్రహం
ఓటర్లను టార్గెట్ చేస్తూ అవమానకర వ్యాఖ్యలు
కలెక్టర్, ఎమ్మార్వోలకు ఫిర్యాదు చేయనున్న బాధితులు

కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల అనంతరం కొన్ని డివిజన్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా 28వ డివిజన్‌లో ఓటమి చెందిన అభ్యర్థి బంధువులుగా ఉన్న రేషన్ డీలర్ ఓటర్లపై బూతులు తిట్టుతూ బెదిరింపులకు పాల్పడుతున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమే అయినప్పటికీ, ఓటమిని జీర్ణించుకోలేక ప్రజలపై అసభ్యకరంగా ప్రవర్తించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేశారు. ప్రజలు తమకు నచ్చిన అభ్యర్థులను ఎన్నుకుని కార్పొరేటర్లుగా గెలిపించగా, మిగిలిన వారు ఓటమిపాలయ్యారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు రోజుల తర్వాత కూడా ఓటమిని అంగీకరించలేక కొందరు వ్యక్తులు ఓటర్లను లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

రేషన్ కోసం వచ్చిన వారిపై బూతులు

28వ డివిజన్‌లో ఓడిపోయిన అభ్యర్థి బంధువులు గత కొంతకాలంగా రేషన్ డీలర్‌గా కొనసాగుతున్నారు. తమ బంధువు ఓడిపోవడంతో రేషన్ కోసం వచ్చే ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ “అందరూ కలిసి మా వాడిని ఓడించారు” అంటూ బూతులు తిట్టుతున్నట్లు బాధితులు తెలిపారు. రేషన్ తీసుకోవడానికి వచ్చే ప్రజలను అవమానిస్తూ మాట్లాడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతి నెల రేషన్ కోసం ప్రజలు రావాల్సిందేనని, అప్పుడు ఎలా వస్తారో చూస్తామని ఇండైరెక్ట్‌గా బెదిరింపులు చేస్తున్నట్లు ఓటర్లు చెబుతున్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన రేషన్ డీలర్ ఇలా రాజకీయ కారణాలతో బెదిరింపులకు పాల్పడటం సరైంది కాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా ప్రజల ఓట్లతో ఎదిగిన నాయకులు, వారి బంధువులు ఇప్పుడు ఓటమి చవిచూడగానే అసలు స్వరూపం బయటపడుతోందని 28వ డివిజన్ ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రజలకు నిత్యావసర సరుకులు అందించాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తులు రాజకీయాలకు అనుగుణంగా ప్రవర్తించడం అనైతికమని పేర్కొన్నారు.

అధికారులకు ఫిర్యాదు

ఈ ఘటనపై బాధితులు సోమవారం జిల్లా కలెక్టర్, ఎమ్మార్వోలకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. రేషన్ డీలర్‌పై తక్షణ చర్యలు తీసుకుని ప్రజలకు భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తులు బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.