epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గ్రామాలే అభివృద్ధికి పట్టుకొమ్మలు

గ్రామాలే అభివృద్ధికి పట్టుకొమ్మలు
ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దాలి
సర్పంచులకు అడిషనల్ కమిషనర్ మధులత దిశానిర్దేశం
డీపీఆర్‌సీలో ముగిసిన శిక్షణా తరగతులు

కాకతీయ, కారేపల్లి: గ్రామ పంచాయతీలే అభివృద్ధికి పట్టుకొమ్మలని, నూతనంగా ఎన్నికైన సర్పంచులు తమ గ్రామాలను రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన పంచాయతీలుగా తీర్చిదిద్దాలని పంచాయతీరాజ్ అడిషనల్ కమిషనర్ మధులత పిలుపునిచ్చారు. నగరంలోని డీపీఆర్‌సీ సెంటర్‌లో సింగరేణి మండలానికి చెందిన 41 గ్రామ పంచాయతీల సర్పంచులకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. శిక్షణ పూర్తి చేసుకున్న సర్పంచులకు ఆమె స్వయంగా సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా సర్పంచులతో ముఖాముఖి మాట్లాడుతూ రాబోయే ఐదేళ్లు అత్యంత కీలకమని ఆమె స్పష్టం చేశారు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా ప్రతిరోజూ పారిశుద్ధ్య నిర్వహణపై సర్పంచులు స్వయంగా పర్యవేక్షణ చేయాలని సూచించారు. చెత్త సేకరణ సక్రమంగా జరుగుతుందా లేదా అన్నది నిరంతరం పరిశీలించాలని చెప్పారు. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో పచ్చదనం పెంచేందుకు మొక్కలు నాటడం, వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా జవాబుదారీతనంతో పారదర్శక పాలన అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో భజ్య తండా సర్పంచ్ వాంకుడోత్ హనుమంతరావు, భాగ్యనగర్ సర్పంచ్ భానోత్ హీరాలాల్, కొత్త తండాకు చెందిన ధారావత్ మంగీలాల్, అప్పాయిగూడెం సర్పంచ్ దండు ప్రవీణ్, గాదేపాడు సర్పంచ్ భూక్య రంజిత్ కుమార్, సూర్య తండా సర్పంచ్ రాందాస్ నాయక్, గోవింద్ తండా సర్పంచ్ నునావత్ కిరణ్ నాయక్, దుబ్బ తండా సర్పంచ్ ఆంగోత్ మతృ, పాత కమలాపురం సర్పంచ్ తేజావత్ బాబురావు, గిద్దవారిగూడెం సర్పంచ్ వెంకటేశ్వర్లు, చీమలపాడు సర్పంచ్ మాలోత్ లలిత బావుసింగ్, పోలంపల్లి సర్పంచ్ దారావత్ హేమలత బాలాజీతో పాటు ఇస్లావత్ రాజు, భూక్య బాలు తదితరులు శిక్షణ పూర్తి చేశారు. శిక్షణ ద్వారా గ్రామాల పాలనపై పూర్తి అవగాహన లభించిందని, కమిషనర్ సూచనల మేరకు మండల అభివృద్ధికి కృషి చేస్తామని సర్పంచులు ధీమా వ్యక్తం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.