మనుషులకే కరెంట్ లేదు..!
మహిళా ఏఈ
వింత సమాధానం..
వివాదాస్పదమైన కాల్ రికార్డు వైరల్
కాకతీయ, సిరిసిల్ల టౌన్ : సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు గ్రామంలో పోలాలకు కరెంట్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుకు సెస్ అధికారుల నుంచి వచ్చిన సమాధానం వివాదాస్పదంగా మారింది. విద్యుత్ సరఫరా సమస్యపై రైతు అడిగిన ప్రశ్నలకు ఏఈ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది.
అధికారుల తీరుపై రైతులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రగుడు గ్రామానికి చెందిన ఒక రైతు తన పోలాలకు కరెంట్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. రాత్రి నుంచే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పంటలకు నీరు పెట్టలేకపోయానని రైతు అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇదే విషయంపై ఏఈ దృష్టికి తీసుకెళ్లాడు. అయితే ఆమె ఇచ్చిన సమాధానంతో ఖంగుతిన్నాడు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆ పరిధిలో పనిచేస్తున్న సెస్ ఏఈకి ఫోన్ చేసి కారణం ఏమిటని అడిగాడు. అయితే దీనికి మహిళ ఏఈ “మనుషులకే కరెంట్ లేదు” అంటూ సమాధానం చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాక రాత్రి నుంచే కరెంట్ ఎందుకు లేదని మరోసారి ప్రశ్నించగా రాత్రి నుంచి ఏం చేశారు” అంటూ ప్రశ్నించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలాలకు కరెంట్ ఇవ్వాలని అడిగితే ఇలా మాట్లాడటం సరైంది కాదని రైతు ప్రశ్నిస్తున్నాడు.

