epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జ్యూస్​ తాగితే చాక్లెట్​ ఇస్తా..

జ్యూస్​ తాగితే చాక్లెట్​ ఇస్తా..
మాయమాటలు చెప్పి చిన్నారికి యాసిడ్​ తాగించిన పిన్ని
తన కొడుకుని చిన్న చూపు చూస్తున్నారనే నెపంతో తోటికోడలి కుమారుడిపై కక్ష
నాలుగేళ్ల బాలుడిపై గ‌తంలోనూ రెండు సార్లు హ‌త్యాయ‌త్నం
పోలీసుల‌కు కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు
మేడిపల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలో అమానుష ఘటన

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: పిల్లాడిని ఆడించి, లాలించడంలో తల్లితో పాటు పిన్ని కూడా కీలకంగా వ్యవహరిస్తుంది. ప్రతి కుటుంబంలో పిన్ని అంటే తల్లి తర్వాత మరో తల్లిగా భావించాలని మన కుటుంబ వ్యవస్థ చెబుతోంది. అయితే అంతటి బంధాన్ని ఓ మహిళ తన అసూయతో చెరిపేసింది. తన కొడుకును ఇంట్లో చిన్నచూపు చూస్తున్నారనే నెపంలో తోడికోడలి కుమారుడిపై దారుణానికి ఒడిగట్టింది. నాలుగు సంవత్సరాల వయసున్న చిన్నారికి ఆమె యాసిడ్ తాగించింది. ఈ ఘటన మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బోడుప్పల్​ శ్రీనివాస కాలనీలో ఉండే పర్వతం సతీశ్​ కుమార్​, అంజమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు నాగరాజు, జగదీశ్​ ఉన్నారు. కాగా వారిద్దరికి వివాహాలు జరిగాయి. వారికి పిల్లలూ ఉన్నారు. అంతా ఉమ్మడి కుటుంబంలా ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇలాంటి సంతోషకరమైన కుటుంబంలో ఓ విషాదం చోటు చేసుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇంటిలో పెద్దకుమారుడికి కూడా కొడుకున్నాడు. అతడంటే సతీశ్​కు ఎనలేదని ప్రేమ. దీంతో పెద్ద కుమారుడి కొడుకు (4)పై తాత ఎక్కువ ప్రేమ చూపించడాన్ని చిన్న కోడలు మంజుల సహించలేకపోయింది. మరోవైపు తన బిడ్డను తాత పట్టించుకోకపోవడంతో బాధిపడింది. అయితే వారికి ఎలాగైనా బాద్ధి చెప్పాలని భావించింది. పచ్చబొట్టు వేయించుకున్నారనే నెపంతో మరింత ఆగ్రహం : అయితే ఇటీవల తాత తన చేతిపై పెద్ద కుమారుడి కొడుకు పేరును పచ్చబొట్టు వేయించుకున్నారు. దీంతో అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. తోటి కోడలి కుమారుడిని హత్య చేయడమే ఈ సమస్యకు సరైన పరిష్కారమని భావించింది. చిన్నారిని హత్య చేసేందుకు అనేక పథకాలు రచించింది. దీనికోసం అనేక ప్రయత్నాలు చేసింది. అయితే ఈ విషయం ఎవరీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా తన పని కానిచ్చింది.

ఊపిరాడకుండా చేయాలని భావించి..

వాటిలో మొదటి ప్రయత్నంగా ఇంట్లో చిన్నారిని ఊపిరాడకుండా చేయాలని భావించి అతడి నోరు, ముక్కు మూసింది. చేతులను గట్టిగా పట్టుకుంది. అయితే ఈ ఘటనను బాలుడి తల్లి గమనించింది. ఆమె ఒక్కసారిగా ప్రశ్నించడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. వెంటనే ఆడుకుంటున్నామని అబద్ధం చెప్పి తప్పించుకుంది. అది మొదటిసారి కావడంతో తనకూ అనుమానం కలగలేదు. ఆమె చెప్పిన మాటలు నిజమని నమ్మింది. అయితే మరోసారి ఆ బాలుడిని హత్య చేసేందుకు ఇంటిపై అంతస్తుకు తీసుకెళ్లింది. చిన్నారిని రెయిలింగ్​పై కూర్చోపెట్టింది. ఇది గమనించిన తాత ఆమెను గట్టిగా మందలించాడు. పిల్లాడిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయినా ఆమె బుద్ధి మారలేదు. చివరిగా మూడోసారి ప్రయత్నించింది. ఈ నెల 9న మంజుల అతడిని కిచెన్​లోకి తీసుకెళ్లింది. చిన్నారితో ప్రేమగా మాట్లాడి జ్యూస్​ తాగితే చాక్లెట్​ ఇస్తానని చెప్పింది. పిన్ని చెప్పిన మాటలు నమ్మిన ఆ బాలుడు ఆమె చెప్పినట్టే చేశాడు. అయితే ఆమె జ్యూస్​ ఇవ్వకుండా యాసిడ్​ తాగించింది. జ్యూస్​ తాగటంతో చిన్నారి అస్వస్థతకు గురయ్యాడు. బాలుడి పరిస్థితి గమనించిన తల్లిదండ్రులు అతడిని దగ్గరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. బాలుడు యాసిడ్​ తాగినట్లు వైద్యులు పేర్కొన్నారు. దీంతో బుధవారం రాత్రి చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.