epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గేట్ కారేపల్లిలో మత్స్యకార సొసైటీ వివాదం

గేట్ కారేపల్లిలో మత్స్యకార సొసైటీ వివాదం
అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం
తుమ్మలకుంట చెరువులో చేపల వేటతో లక్షల్లో నష్టం
పట్టాదారుల భూములపై సొసైటీ చట్టబద్ధతపై సందేహాలు
తక్షణ విచారణకు గ్రామస్తులు డిమాండ్

కాకతీయ, కారేపల్లి : కారేపల్లి మండలంలోని గేట్ కారేపల్లి గ్రామంలో మత్స్యకార సొసైటీ వ్యవహారం తీవ్ర వివాదానికి దారి తీసి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కారణంగా సమస్య రోజురోజుకీ ముదురుతూ గ్రామస్తుల మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. రెండు వేల పదకొండు సంవత్సరంలో ఏర్పాటైన మత్స్యకార సొసైటీ కార్యకలాపాలపై ప్రస్తుతం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత పట్టా భూములు, దేవాదాయ భూములపై సొసైటీ ఎలా ఏర్పడిందని భూస్వాములు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. చట్టబద్ధతపై సందేహాలు వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారుల పాత్రపై కూడా గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే కొంతమంది అధికారులపై కేసులు నమోదైనట్లు సమాచారం.

 

చెరువులో చేపల వేట… పరిస్థితి ఉద్రిక్తం

గ్రామంలోని తుమ్మలకుంట చెరువులో కొంతమంది వ్యక్తులు అనుమతి లేకుండా చేపల వేట చేపట్టడంతో సొసైటీకి లక్షల్లో నష్టం వాటిల్లిందని సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత మరింత పెరిగింది. అధికారుల తప్పిదాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమస్యకు ఇప్పటికీ శాశ్వత పరిష్కారం లేకపోవడంతో గ్రామస్తుల ఆగ్రహం రోజురోజుకీ పెరుగుతోంది. ప్రస్తుతం గ్రామంలో శాంతిభద్రతలు దెబ్బతినే పరిస్థితి నెలకొనడంతో ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని గ్రామస్తులు, సొసైటీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. భూస్వాముల హక్కులు కాపాడుతూ సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపాలని కోరుతున్నారు. పరిష్కారం ఆలస్యం అయితే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.