రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం
ప్రతి గింజను మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం
మధ్యవర్తులను నమ్మి రైతులు మోసపోవద్దు
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు
ముదిగొండలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
కాకతీయ, ముదిగొండ: తెలంగాణలో రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్యేయమని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని మేడేపల్లి, వనంవారి కిష్టాపురం గ్రామాల్లో మంగళవారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌తో కలిసి ఆయన పాల్గొని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. రైతులు తమ పంటను దళారులకు తక్కువ ధరకు అమ్మి నష్టపోకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధర పొందాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని పేర్కొన్నారు.
భారీగా తరలివచ్చిన నేతలు.. రైతులు
ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు పుచ్చలకాయల వీరభద్రం, మాత్కేపల్లి మార్కెట్ వైస్ చైర్మన్ పర్సాగాని తిరుపతిరావు, మేడేపల్లి సర్పంచ్ చెరుకుపల్లి జగన్నాధం, సోసైటీ మాజీ చైర్మన్ సామినేని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అలాగే వనంవారి కిష్టాపురం సర్పంచ్ పర్నకోల సరళ, ఉప సర్పంచ్ పొదిలి గోపి, ముత్తారం సర్పంచ్ లంజపల్లి మమత, మండల కాంగ్రెస్ నాయకులు మల్లెల అజయ్, పల్లిపాటి కృష్ణ, గ్రామాధ్యక్షులు పొదిలి తిరపయ్య, లంజపల్లి బుచ్చయ్య, మాజీ ఎంపీటీసీ ఏటుకూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం సందర్భంగా గ్రామస్తులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

