epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం

రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం
దళారులను నమ్మి మోసపోవద్దు.. ప్రభుత్వ మద్దతు ధర పొందాలి
సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తున్న సర్కార్
మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో ధాన్యం తరలింపు వేగవంతం
హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి

కాకతీయ, చిగురుమామిడి: రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని, అన్నదాతలు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర పొంది సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో మంగళవారం హైదరాబాద్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ అసోసియేషన్ (హాకా) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.

మద్దతు ధరతో పాటు బోనస్..

ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని తక్కువ ధరకు దళారులకు అమ్మి నష్టపోవద్దని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న రూ. 2,389 మద్దతు ధరను వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యంగా సన్న వడ్లు పండించిన రైతులకు క్వింటాలుకు అదనంగా రూ. 500 బోనస్ అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లి, యుద్ధ ప్రాతిపదికన తూకం వేసి మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకుంటామని రైతులకు భరోసా ఇచ్చారు.

కేంద్రాల వద్ద వసతులు కల్పించాలి..

ధాన్యం విక్రయానికి వచ్చే రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఎండ తీవ్రత దృష్ట్యా నీడ సౌకర్యం, తాగునీరు వంటి కనీస వసతులు కల్పించాలని నిర్వాహకులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా కొనుగోళ్లు జరపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కాంతల శ్రీనివాస్ రెడ్డి, గ్రామ సర్పంచ్ చింతపూల నరేందర్ పటేల్, డీఎం కిష్టయ్య, ఉపసర్పంచ్ చింతపుల అనిల్ కుమార్ పటేల్ పాల్గొన్నారు. అలాగే మండల వ్యవసాయ శాఖ అధికారి పున్నం చందర్ రెడ్డి, హాకా సెంటర్ ఇన్‌ఛార్జ్ పొన్నం తిరుపతి గౌడ్, వార్డు సభ్యులు నడిగోట్టు కిరణ్, ఎస్.కె. ఉమర్, అందే తిరుపతి, తోట లక్ష్మణ్, బింగి స్వామి తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.