epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నీటి సమస్యల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి

నీటి సమస్యల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి
పైప్‌లైన్ లీకేజీలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి
వసతి గృహాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
క‌రీంన‌గ‌ర్‌ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
చొప్పదండి మండలంలో పర్యటన

కాకతీయ, కరీంనగర్ : వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. మంగళవారం చొప్పదండి మండలంలోని గుమ్లాపూర్, కాట్నపల్లి పంచాయతీల పరిధిలోని మల్లన్నపల్లి గ్రామాల్లో పర్యటించిన ఆమె, అక్కడ అందుబాటులో ఉన్న మంచినీటి బావులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ పర్యటనలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

నీటి సరఫరాపై స్పష్టమైన ఆదేశాలు

గ్రామాల జనాభా అవసరాలకు అనుగుణంగా నీటి సరఫరా జరిగేలా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిధులతో చేపట్టిన పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పైప్‌లైన్‌లలో లీకేజీలను అరికట్టాలని, చేతి పంపులు, సింగిల్ ఫేజ్ మోటార్ల పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎంపీఓలు, నోడల్ అధికారులను సూచించారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలను ముందే గుర్తించి, సమస్య పరిష్కారానికి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని ఆర్‌డబ్ల్యూఎస్ (RWS) అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం చొప్పదండిలోని ఎస్సీ సంక్షేమ వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో రాజీ పడొద్దని, వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచాలని స్పష్టం చేశారు. వంటగది, భోజనశాల, మరుగుదొడ్లను పరిశీలించిన ఆమె.. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని వార్డెన్‌ను ఆదేశించారు. సిబ్బంది విధిగా వసతి గృహంలోనే ఉండి విధులు నిర్వర్తించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పర్యటనలో జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) జగదీశ్వర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాస్, డీఈ వినయ్, తహసీల్దార్ నవీన్ కుమార్, ఎంపీడీఓ వేణుగోపాల చారి, వార్డెన్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.