ఐఐటీ-జేఈఈ మెయిన్స్‌లో అల్ఫోర్స్ దూకుడు
1000లోపు 14 ర్యాంకులు.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 450 మంది అర్హత
విజేతలను అభినందించిన చైర్మన్ డా. వి. నరేందర్ రెడ్డి
కాకతీయ, కరీంనగర్ : దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన ఐఐటీ-జేఈఈ (మెయిన్)–2026 ఫలితాలలో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. తెలంగాణ, మహారాష్ట్రల్లోని అల్ఫోర్స్ క్యాంపస్‌లకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి సంస్థ కీర్తిని మరోసారి చాటిచెప్పారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అద్భుతమైన పర్సంటైల్స్‌తో టాప్ ర్యాంకుల్లో నిలిచారు. ఈ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థి ఎం. శ్రీపార్టీష్ ఆల్ ఇండియా 29వ ర్యాంకు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. వారితో పాటు మరికొందరు విద్యార్థులు సాధించిన
సి.హెచ్. లక్ష్మీహాసిని: 116వ ర్యాంకు, సి.హెచ్. పూర్ణచంద్: 138వ ర్యాంకు, ఎస్. వర్జినిరెడ్డి: 211వ ర్యాంకు
ఎన్. రత్నప్రకాశ్: 239వ ర్యాంకు, పి. అక్షయ: 250వ ర్యాంకు, ఎ. కీర్తన: 274వ ర్యాంకు, యు. సిద్దీశ్వర్: 459వ ర్యాంకు, మొత్తంగా జాతీయ స్థాయిలో 1000 లోపు 14 ర్యాంకులు, 2000 లోపు 18 ర్యాంకులు, 5000 లోపు 35 ర్యాంకులు సాధించడం విశేషం.
అడ్వాన్స్‌డ్‌కు భారీగా ఎంపిక..
జేఈఈ మెయిన్ ఫలితాల ఆధారంగా అల్ఫోర్స్ సంస్థకు చెందిన 450 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డా. వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పటిష్టమైన ప్రణాళిక, అధ్యాపకుల నాణ్యమైన బోధన, విద్యార్థుల నిరంతర కృషి వల్లే ఈ అద్భుత విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఐఐటీ, నీట్, ఈఏపీసెట్ వంటి పోటీ పరీక్షల్లో అల్ఫోర్స్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే అడ్వాన్స్డ్ పరీక్షలో కూడా తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపి ఐఐటీలలో సీట్లు సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అసాధారణ ప్రతిభ చూపిన విద్యార్థులను, వారికి సహకరించిన తల్లిదండ్రులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

