epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కరీంనగర్ బ‌ల్దియాపై కాషాయం ప‌ట్టు

కరీంనగర్ బ‌ల్దియాపై కాషాయం ప‌ట్టు
ఐదు కో ఆప్ష‌న్ ప‌ద‌వుల‌ను స్వీప్ చేసిన బీజేపీ
ఫ‌లించిన కేంద్ర‌మంత్రి సంజయ్ వ్యూహం
కమలం గూటికి చేరిన నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు
పోటీకి దూరంగా కాంగ్రెస్.. బెంబేలెత్తిన గులాబీ శ్రేణులు
సామాజిక సమీకరణాలతో ప‌ద‌వుల్లో సామాన్యులకు పెద్దపీట
మున్సిపల్ కార్పొరేషన్‌లో మారిన రాజకీయ ముఖచిత్రం
బండి మార్గదర్శకత్వంలో పక్కాగా సాగిన ఆపరేషన్

కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సంపూర్ణ ఆధిపత్యాన్ని చాటింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పక్కా వ్యూహంతో ఐదుకు ఐదు స్థానాలను కైవసం చేసుకుని ప్రత్యర్థులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న ఈ ఎన్నికల్లో బీజేపీ వేసిన స్కెచ్ సక్సెస్ కావడంతో కాషాయ దళం క్లీన్‌స్వీప్ సాధించింది. మొత్తం 38 మంది సభ్యులు బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా ఓటు వేయగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు పార్టీ గీత దాటి బీజేపీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించడం జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఓటింగ్ ప్రక్రియలో గులాబీ పార్టీ తడబడగా కాంగ్రెస్ పార్టీ కనీసం పోటీకి కూడా నిలవలేక దూరంగా ఉండిపోయింది.

కష్టపడ్డ కార్యకర్తలకు పదవులు

కోఆప్షన్ సభ్యుల ఎంపికలో బీజేపీ సామాన్య కార్యకర్తలకు పెద్దపీట వేయడం విశేషం. పార్టీ కోసం ఏళ్ల తరబడి జెండా మోసిన వారికే పదవులు కట్టబెట్టాలని బండి సంజయ్ ఇచ్చిన సంకేతాలను ఎంపిక కమిటీ తూచా తప్పకుండా అమలు చేసింది. మైనార్టీ విభాగంలో మొదటి నుంచి పార్టీని నమ్ముకుని పనిచేసిన ముజీబ్‌కు అవకాశం కల్పించగా పట్టణంలోని సిక్కు సమాజ ప్రాధాన్యతను గుర్తిస్తూ బల్బీర్ సింగ్‌ను ఎంపిక చేశారు. సామాజిక సమీకరణాలను బేరీజు వేస్తూనే నిబద్ధత కలిగిన కార్యకర్తలకు గుర్తింపునివ్వడం ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఈ నిర్ణయంతో బీజేపీ క్షేత్రస్థాయిలో తన పట్టును మరింత బలపర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది.

సామాన్యులకే పట్టాభిషేకం..

పదవుల పంపిణీలో నిరుపేద కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా బీజేపీ సరికొత్త సంప్రదాయానికి తెరలేపింది. బొమ్మకల్‌కు చెందిన నిరుపేద కార్యకర్త నందన్ కుమార్‌కు కోఆప్షన్ సభ్యత్వం దక్కడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కనీస వసతులు కూడా లేని స్థితిలో ఉన్న సామాన్య వ్యక్తిని గుర్తించి గౌరవించడం పట్ల పార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఎస్సీ మహిళా విభాగంలో చిగురు వెంకటమ్మకు అవకాశం ఇవ్వగా వైశ్య వర్గానికి చెందిన కన్నె కృష్ణను కూడా సభ్యుడిగా ఎంపిక చేశారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ సామాన్యులను చట్టసభలకు పంపడం ద్వారా బండి సంజయ్ తనదైన ముద్ర వేశారు.

మారిన రాజకీయ సమీకరణాలు

ఈ విజయంతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. అధికార పార్టీకి కంచుకోటగా ఉన్న నగరంలో బీజేపీ క్లీన్‌స్వీప్ చేయడం బీఆర్ఎస్ పతనానికి నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సొంత కార్పొరేటర్లే బీజేపీకి ఓటు వేయడం ఆ పార్టీలోని అసమ్మతిని బయటపెట్టింది. కాంగ్రెస్ పార్టీ కనీసం ఉనికిని కూడా చాటుకోలేకపోవడం ఆ పార్టీ బలహీనతను స్పష్టం చేస్తోంది. సామాన్య కార్యకర్తలకు అవకాశాలు కల్పించడం ద్వారా రాబోయే రోజుల్లో కరీంనగర్ లో తిరుగులేని శక్తిగా ఎదగాలని బీజేపీ భావిస్తోంది. ఈ ఫలితం జిల్లాలోని ఇతర నియోజకవర్గాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.