epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వెయ్యి కార్లు.. 250 బస్సులు మోదీ సభకు భారీ సమీకరణ

వెయ్యి కార్లు.. 250 బస్సులు మోదీ సభకు భారీ సమీకరణ

కరీంనగర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్ర మంత్రి బండి సంజయ్

కాకతీయ, కరీంనగర్: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈనెల 10న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభను భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చుట్టుపక్కల జిల్లాల నుండి భారీ ఎత్తున జనాన్ని సమీకరించే పనిలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి అత్యధిక సంఖ్యలో జన సమీకరణ చేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రత్యేక దృష్టి సారించారు.
గత నాలుగు రోజులుగా కరీంనగర్‌లోనే మకాం వేసి ఇతర కార్యక్రమాలను పక్కనపెట్టి పార్టీ నేతలతో జన సమీకరణపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం విడతలుగా మీటింగ్‌లు జరుపుతూ గ్రామాల వారీగా వార్డు సభ్యులు, ఉప సర్పంచులు, సర్పంచులు, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులతో చర్చలు కొనసాగిస్తున్నారు.
మరోవైపు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, కంటెస్టెడ్ కార్పొరేటర్లతోనూ సమావేశాలు నిర్వహించారు. జిల్లాల వారీగా మండలాల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులతోనూ భేటీ అయ్యారు. గ్రామాలు, మండలాలు, మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్ల వారీగా జన సమీకరణ లక్ష్యాలను నిర్దేశించారు. మండలాల వారీగా ఇంఛార్జీలను నియమించారు.


మోదీ సభ సమీకరణలో భాగంగా రాష్ట్ర నాయకత్వం కూడా జిల్లాల వారీగా ఇంఛార్జీలను నియమించింది. అందులో భాగంగా కరీంనగర్ జిల్లా ఇంఛార్జీగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్, సిరిసిల్ల జిల్లా ఇంఛార్జీగా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి నియమితులయ్యారు. వారు జిల్లాల వారీగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ, మండలాల వారీగా అవసరమైన బస్సులు, కార్ల వివరాలను సేకరించారు.
ఈ వివరాల ప్రకారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి వెయ్యి కార్లు, 250 బస్సులను ఏర్పాటు చేసి వేలాది మందిని మోదీ సభకు తరలించాలని నిర్ణయించారు. చాలా గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా రావడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం రావడంతో వారికి రవాణా, తాగునీరు, భోజన సదుపాయాలు కల్పించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఏ పరిస్థితుల్లోనూ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం జన సమీకరణలో అగ్రస్థానంలో నిలవాలని సూచించారు.

సికింద్రాబాద్‌లో మకాం.. నగరంపై ఫోకస్

మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గురువారం నుండి సికింద్రాబాద్‌లోనే మకాం వేయనున్నారు. పరేడ్ గ్రౌండ్ సభకు సిటీ నుంచే భారీగా జనాన్ని సమీకరించడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. నగరంలోనూ పెద్దఎత్తున జన సమీకరణకు ప్రణాళిక సిద్ధం చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు ముషీరాబాద్ అసెంబ్లీ నేతలతో బర్కత్‌పురాలోని సిటీ కార్యాలయంలో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మన్ హాజరుకానున్నారు. సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలోని సురభి గార్డెన్స్‌లో ముఖ్య కార్యకర్తలతో సమావేశం జరగనుంది.
అదేవిధంగా ఎల్లుండి పార్టీ కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం పాదయాత్ర ద్వారా ఇంటింటికీ వెళ్లి సభకు ఆహ్వానించేలా షెడ్యూల్ రూపొందించారు. నగరంలోని బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు తమ తమ డివిజన్లలో ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి మోదీ సభకు ఆహ్వానించాలని సూచించారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.