epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రాజ్‌భవన్‌లో కాదు.. అసెంబ్లీలోనే మెజారిటీ తేలాలి

రాజ్‌భవన్‌లో కాదు.. అసెంబ్లీలోనే మెజారిటీ తేలాలి
గవర్నర్ తీరు ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే
అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేను ఆహ్వానించకపోవడం సరికాదు
: మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : మెజారిటీ అనేది రాజ్‌భవన్‌లో కాదు, అసెంబ్లీ వేదికగానే నిరూపితం కావాలని మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ పేర్కొన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనపై ఆయన స్పందించారు. ఈ మేరకు చెన్నైలో మీడియాతో మాట్లాడారు. తమిళనాడు ఎన్నికల్లో 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని కమల్ హాసన్ విమర్శించారు. తమిళనాడు చరిత్రలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ చూడలేదని, ఈ క్రమంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన బాధ్యత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిపై ఉందని గవర్నర్‌కు గుర్తు చేశారు.

బొమ్మై తీర్పు స్ఫూర్తితోనే ముందుకు

ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధతను ప్రస్తావిస్తూ ఎస్.ఆర్. బొమ్మై కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును కమల్ హాసన్ ఉటంకించారు. 108 స్థానాలు గెలుచుకున్న విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయమని కోరకపోవడం ఓటర్ల తీర్పును ధిక్కరించడమేనని అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ 233 మంది ఎన్నికైన ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేయలేకపోవడం రాష్ట్రానికి అవమానకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇది పార్టీ పరంగా చేస్తున్న విమర్శ కాదు, ఒక భారతీయ పౌరుడిగా తన రాజ్యాంగ హక్కుల కోసం వినిపిస్తున్న గొంతుక అని ఆయన స్పష్టం చేశారు. తక్షణమే ప్రజా తీర్పును గౌరవించి, రాజ్యాంగపరమైన విధులను నిర్వర్తించాలని ఆయన సంబంధిత వర్గాలను కోరారు. తమకు మెజారిటీ రానందున బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా పనిచేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ రాజకీయ పరిణతిని కమల్ హాసన్ అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.