epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బండి సంజయ్‌కు కాంగ్రెస్ సవాల్

బండి సంజయ్‌కు కాంగ్రెస్ సవాల్
కుమారుడి వ్యవహారంపై పూర్తి నిజాలు చెప్పాలి
నిష్పక్షపాత దర్యాప్తు పూర్తయ్యే వరకు పదవికి దూరంగా ఉండాలి
కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు

కాకతీయ, కరీంనగర్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు డిమాండ్ చేశారు. నిష్పక్షపాత దర్యాప్తు పూర్తయ్యే వరకు కేంద్ర మంత్రి పదవికి దూరంగా ఉంటానని బండి సంజయ్ ప్రకటించాలని సవాల్ విసిరారు.
ఆదివారం మీడియాతో మాట్లాడిన రాజేందర్ రావు.. మైనర్ బాలిక వ్యవహారంలో వస్తున్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ వెంటనే ప్రధాని నరేంద్ర మోదీకి తన రాజీనామా సమర్పించాలని డిమాండ్ చేశారు. తన కుమారుడికి క్లిన్ చిట్ వచ్చి, తన ప్రమేయం లేదని పూర్తిగా నిరూపితమయ్యే వరకు పదవికి దూరంగా ఉంటానని దేశ ప్రజలకు చెప్పాలని కోరారు.
పోలీసుల ఎదుట హాజరు చేయాలి
తన కుమారుడిని స్వయంగా పోలీసుల ముందు హాజరుపరచాలని, రాజకీయ ఒత్తిళ్లు లేకుండా నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని పోలీసులను కోరాలని సూచించారు. అలాగే మేజిస్ట్రేట్ ఎదుట సీఆర్‌పీసీ 164 ప్రకారం స్టేట్‌మెంట్ ఇప్పించాలని అన్నారు. గతంలో ఇదే అంశంపై బండి సంజయ్ మాట్లాడిన విషయాలను గుర్తు చేస్తూ.. అదే నైతిక ప్రమాణాలు ఇప్పుడు తన కుటుంబానికి కూడా వర్తింపజేయాలన్నారు.
మైనర్ బాలికకు సంబంధించిన వ్యవహారంలో అసలు ఏమి జరిగిందో ప్రజలకు పూర్తిగా వెల్లడించాలని, ప్రజలను చీకట్లో ఉంచే ప్రయత్నాలు మానుకోవాలని రాజేందర్ రావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్‌ఐటీ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. “సత్యం ఏదైనా బయటకు రావాలి” అని పేర్కొన్నారు.
నైతిక విలువలు ఆచరణలో చూపాలి
“మహిళల గౌరవం, సనాతన ధర్మం, నైతిక విలువలు గురించి మాట్లాడే బండి సంజయ్.. ఇప్పుడు వాటిని ఆచరణలో చూపించాల్సిన సమయం వచ్చింది” అని అన్నారు. లేకపోతే “దేశం కోసం.. ధర్మం కోసం” వంటి నినాదాలు కేవలం రాజకీయ పంచ్ డైలాగులుగానే మిగిలిపోతాయని వ్యాఖ్యానించారు.
ఈ వ్యవహారంలో ప్రజలు రాజకీయ ప్రతిస్పందనలు కాకుండా నిజాయితీ, పారదర్శకత, బాధ్యతాయుతమైన స్పందనను ఆశిస్తున్నారని రాజేందర్ రావు పేర్కొన్నారు. బాధిత బాలికకు న్యాయం చేయడానికి ముందుకు రావాలని, తప్పు చేసిన వ్యక్తి తన కుమారుడే అయినా వదిలిపెట్టనని చెప్పే ధైర్యం బండి సంజయ్ చూపించాలని సవాల్ విసిరారు.
“బేటీ బచావో” నినాదాన్ని విశ్వసిస్తున్నామని చెప్పే నాయకులు దానిని ఆచరణలోనూ నిరూపించాలని అన్నారు. ప్రాథమికంగా ఆరోపణలు నిజమని తేలితే బాధిత బాలికకు, ఆమె కుటుంబానికి తాను అండగా ఉంటానని రాజేందర్ రావు ప్రకటించారు. మహిళల భద్రత, గౌరవం విషయంలో రాజీ ఉండకూడదని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.