యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా హిసామోద్దీన్
పార్టీ సేవలకు అధిష్టానం గుర్తింపు
కష్టకాలంలో పార్టీ బలోపేతానికి కృషి
కాంగ్రెస్ నేతలకు హిసామోద్దీన్ కృతజ్ఞతలు
కాకతీయ, శంకరపట్నం: మండలంలోని కేశవపట్నం గ్రామానికి చెందిన మహమ్మద్ హిసామోద్దీన్ను యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు. పార్టీ పట్ల ఆయన చూపిన నిబద్ధత, సేవలను గుర్తించిన అధిష్టానం ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
గతంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన హిసామోద్దీన్.. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ముఖ్యంగా మండలంలో యువజన కాంగ్రెస్ మనుగడను కాపాడడంలో కీలక పాత్ర పోషించినట్లు నాయకులు పేర్కొన్నారు.
పార్టీ బలోపేతానికి కృషి
యువతను పార్టీ వైపు ఆకర్షిస్తూ కాంగ్రెస్ కార్యక్రమాలను గ్రామస్థాయిలో విస్తృతంగా నిర్వహించారని పార్టీ నేతలు తెలిపారు. ఆయన సేవలను గుర్తించిన అధిష్టానం జిల్లా ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించడం పట్ల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ, టీపీసీసీ మెంబర్, మాజీ జడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్లకు మహమ్మద్ హిసామోద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు.

