epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రాణాలు తీస్తున్న ఎల్ఈడీ కాంతులు

ప్రాణాలు తీస్తున్న ఎల్ఈడీ కాంతులు
నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు వినియోగం
కఠిన చర్యలకు సిద్ధమైన పోలీసులు
అలాంటి వాహ‌నాల‌ను సీజ్ చేస్తాం : చందుర్తి సీఐ ర‌వీంద‌ర్‌

కాకతీయ, వేములవాడ : రహదారులపై రాత్రి వేళల్లో ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. వాహనాలకు అమర్చుతున్న మిరుమిట్లు గొలిపే ఎల్‌ఈడీ లైట్లు, హైబీమ్‌ ఫోకస్‌లు ఇతర వాహనదారుల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయి. యువత ఫ్యాషన్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు చేస్తున్న మార్పులు రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయి. దీనిపై రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. బైక్‌లు, కార్లు, ట్రాక్టర్లు, ప్రైవేట్ బస్సులకు విచ్చలవిడిగా రంగురంగుల ఎల్‌ఈడీ లైట్లు అమర్చుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. రాత్రి సమయంలో ఎదురుగా వచ్చే వాహనాలపై ఈ హై-ఫోకస్ లైట్లు పడటంతో, ఇతర డ్రైవర్ల దృష్టి కొద్ది క్షణాల పాటు మందగిస్తోంది. దీంతో ఎదురుగా ఏముందో తెలియక వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలను బేఖాతరు చేస్తూ కొందరు వాహనదారులు చేస్తున్న ఈ అనవసర అలంకరణలు ఇతరుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి.

అలాంటి వాహ‌నాల‌ను సీజ్ చేస్తాం : చందుర్తి సీఐ, ర‌వీంద‌ర్‌

అనుమతిలేని ఎల్‌ఈడీ లైట్లు అమర్చుకుంటే వాహనాలను సీజ్ చేస్తామని చందుర్తి సీఐ రవీందర్ హెచ్చరించారు. వాహనాలకు ఎక్స్‌ట్రా ఫిట్టింగ్‌లు, మోడిఫికేషన్‌లు చేయడం మోటార్ వాహన చట్టంలోని సెక్షన్-52 ప్రకారం నేరమని స్పష్టం చేశారు. కంపెనీ నుంచి వచ్చిన సాధారణ లైట్లు మాత్రమే ఉండాలని, అదనపు కాంతిని వెదజల్లే లైట్లు ఉంటే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని సూచించారు. ఇప్పటికే దీనిపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఫ్యాషన్ కోసం ప్రాణాలను పణంగా పెట్టవద్దని, ప్రాణ భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన వాహనదారులకు పిలుపునిచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.