బండి సంజయ్‌ను పదవి నుంచి తొలగించాలి
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య డిమాండ్
కరకగూడెం కేంద్రంలో బీఆర్ ఎస్ నేతల నిరసన
కాకతీయ, కరకగూడెం : మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలని కరకగూడెం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య డిమాండ్ చేశారు. సోమవారం కరకగూడెం ప్రధాన కూడలిలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని నినాదాలు చేశారు. అనంతరం సోమయ్య మాట్లాడుతూ.. పోక్సో కేసు నమోదైనప్పటికీ నిందితుడిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం దారుణమన్నారు. “తాను బీసీ బిడ్డనని చెప్పుకునే బండి సంజయ్.. బాధితురాలు కూడా బీసీ బిడ్డ అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోయారు?” అని నిలదీశారు. బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి, కేసును నీరుగార్చే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పోగు వెంకటేశ్వర్లు, బుడగం రాము, ఊకె రామనాధం, కొమరం రాంబాబు, సారా సాంబశివరావు, బైరిశెట్టి చిరంజీవి, ఏళ్ళు రామకృష్ణ రెడ్డి, ముద్దం సాంబయ్య, సతీష్, దాసరి సాంబశివరావు, ఆదినారాయణ, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

