23 నుంచి ‘వి.ఎన్.ఆర్’ క్రికెట్ టోర్నమెంట్
విజేతలకు రూ.20 వేల ప్రథమ బహుమతి : వెలుగునీడ సంస్థ
కాకతీయ, శంకరపట్నం : మండలంలోని జాతీయ రహదారి పక్కన గల మైదానంలో ఈ నెల 23వ తేదీ నుంచి ‘వి.ఎన్.ఆర్’ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కానున్నట్లు వెలుగునీడ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మోరె గణేష్ తెలిపారు. ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్, వి.ఎన్.ఆర్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు వూట్కూరి నరేందర్ రెడ్డి పేరు మీద ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్లో విజేత నిలిచిన జట్టుకు ప్రథమ బహుమతిగా రూ.20 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.10 వేలతో పాటు భారీ ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామన్నారు. మానకొండూరు, హుజురాబాద్ నియోజకవర్గాలకు చెందిన జట్లు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు. ఈ నెల 23న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కార్యవర్గ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని వివరించారు. టోర్నమెంట్లో పాల్గొనదలిచిన జట్లు ఈ నెల 21వ తేదీలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాల కోసం దాసరి శివస్వామి (9100329475), కోరేపల్లి శివప్రసాద్ (6309467780)లను సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో ఉపసర్పంచ్ దండు రాజేష్, కాలేసి కరుణాకర్, ఎలుకపల్లి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

