మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్‌కు ఘన సన్మానం
డైరెక్టర్ల నియామకంలో హుజూరాబాద్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి
కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రణవ్
కాకతీయ,హుజురాబాద్ : రాష్ట్రంలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపుగా కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేషన్ పదవులను కేటాయిస్తోందని హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు. కరీంనగర్‌లోని ఇందిరా భవన్‌లో సోమవారం నిర్వహించిన అభినందన సభలో.. ఇటీవల మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌లతో కలిసి ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ.. ఒకేసారి 11 కార్పొరేషన్ల చైర్మన్లను నియమించి సీఎం రేవంత్ రెడ్డి కార్యకర్తలకు పెద్దపీట వేశారన్నారు. మున్నూరు కాపుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆయన.. త్వరలో చేపట్టబోయే కార్పొరేషన్ డైరెక్టర్ల నియామకాలలో హుజూరాబాద్ నియోజకవర్గానికి కూడా అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, రజత్‌కుమార్, పట్టణ అధ్యక్షుడు అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

