వాసిని వీరయ్య మృతి తీరని లోటు
సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్
నాయకులతో కలసి పార్థివదేహానికి నివాళులు
కాకతీయ జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ సీపీఐ సీనియర్ నాయకులు వాసిని వీరయ్య మరణం పట్ల సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం కాకర్ల గ్రామంలో వీరయ్య పార్థివ దేహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా చండ్ర నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. తుదిశ్వాస వరకు ప్రజల కోసం పనిచేసిన వీరయ్య లాంటి అమరులను ఆదర్శంగా తీసుకుని ప్రజాసమస్యలపై మరిన్ని ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. వీరయ్య మృతి కుటుంబానికే కాక పార్టీకి కూడా తీరని లోటన్నారు. ఆయన పార్టీకి అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. త్యాగధనులు అందించిన ఎర్రజెండాను కాకర్ల ప్రాంతంలో సగర్వంగా నిలబెడతామని, బాధిత కుటుంబ సభ్యులకు కమ్యూనిస్టు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వీరయ్యకు నివాళులర్పించిన వారిలో కాకర్ల గ్రామ శాఖ కార్యదర్శి చిమాట ముత్తయ్య, పార్టీ నాయకులు ఉదరి నాగయ్య, బెజవాడ సీతయ్య, కంపసాటి నాగేశ్వరరావు, ముత్తిలింగం, బెజవాడ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

