epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఈ సారి కోలుకోలేని దెబ్బ తీస్తాం

ఈ సారి కోలుకోలేని దెబ్బ తీస్తాం
అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌కు ఇరాన్ హెచ్చరిక
మా సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచుకున్నాం
అమెరికా మళ్లీ దాడులకు దిగితే తీవ్ర పరిణామాలు
మహమ్మద్ బాఖెర్ గాలిబాఫ్ సంచలన వ్యాఖ్యలు

టెహ్రాన్ : అమెరికా గనుక మూర్ఖత్వంతో మళ్లీ యుద్ధాన్ని ప్రారంభిస్తే ఈసారి అంతకంటే కోలుకోలేని, అత్యంత చేదైన పరాజయం తప్పదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, ఆ దేశ సీనియర్ సంప్రదింపుల ప్రతినిధి మహమ్మద్ బాఖెర్ గాలిబాఫ్ హెచ్చరించారు. గత ఏప్రిల్ 8న కుదిరిన తాత్కాలిక సీజ్‌ఫైర్ (కాల్పుల విరమణ) సమయాన్ని తమ సాయుధ దళాలు సైనిక సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఉపయోగించుకున్నాయని ఆయన స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ టెహ్రాన్‌లో పర్యటించి, ఇరాన్ ఉన్నతాధికారులతో జరిపిన చర్చలు ముగిసిన వెంటనే గాలిబాఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక సీజ్‌ఫైర్‌ను శాశ్వత శాంతి ఒప్పందంగా మార్చేందుకు ఇస్లామాబాద్ ముమ్మర దౌత్య ప్రయత్నాలు చేస్తోంది. అయితే, ఈ చర్చల్లో అమెరికా అడ్డగోలు డిమాండ్లు పెడుతోందని ఇరాన్ ఆరోపిస్తోంది. “ట్రంప్ మరోసారి తప్పు చేసి యుద్ధాన్ని ప్రకటిస్తే.. అది మొదటి రోజు యుద్ధం కంటే అమెరికాకు అత్యంత ఘోరంగా మారుతుంది” అని గాలిబాఫ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమ దేశ ప్రజల హక్కుల విషయంలో వెనక్కి తగ్గేదే లేదని ఇరాన్ స్పష్టం చేసింది.

ట్రంప్‌తో మాట్లాడిన ఖతార్ అమీర్
మరోవైపు, ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడారు. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య పాకిస్థాన్ చేస్తున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలపై ఇద్దరు నేతలు చర్చించారు. అంతర్జాతీయ చమురు సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధి భద్రత, సముద్ర రవాణా రక్షణ కోసం చర్చలు కొనసాగించడం అవసరమని ఖతార్ అమీర్ అభిప్రాయపడ్డారు.

మళ్లీ దాడులకు వైట్ హౌస్ ప్లాన్?
ఇరాన్‌తో చర్చలు ఒక కొలిక్కి రాకపోవడంతో, అమెరికా మళ్లీ సైనిక దాడులకు సిద్ధమవుతున్నట్లు అక్కడి మీడియా సంస్థలు ‘అక్సియోస్’, ‘సీబీఎస్ న్యూస్’ కథనాలను ప్రసారం చేశాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు చేయడంతో ఈ యుద్ధం మొదలైంది. పాకిస్థాన్ వేదికగా జరిగిన చర్చలు సత్ఫలితాలు ఇవ్వకపోవడం, హార్ముజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ రాకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఒకవేళ దౌత్య ప్రయత్నాలు విఫలమైతే తాము సైనిక చర్యకు వెనుకాడబోమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇప్పటికే హింట్ ఇచ్చారు. అమెరికా పదే పదే నమ్మకద్రోహానికి పాల్పడుతున్నా, తాము మాత్రం ఇంకా శాంతి చర్చలకు కట్టుబడే ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.