epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఈదురు గాలుల బీభత్సం 

ఈదురు గాలుల బీభత్సం 
ఇల్లంతకుంట మండలంలో భారీ నష్టం!
ఇళ్ల పైకప్పు రేకులు, చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం
గాల్లోకి లేచిన ట్రాక్టర్.. ఒకరికి తీవ్ర గాయాలు
ఐకేపీ కేంద్రాల్లో తడిసి ముద్దయిన వరి ధాన్యం
కాకతీయ, ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మారిన వాతావరణం బీభత్సం సృష్టించింది. హఠాత్తుగా వీచిన భారీ ఈదురు గాలులు, అకాల వర్షం కారణంగా మండలంలోని గాలిపల్లి, పత్తికింటపల్లి గ్రామాల్లో తీవ్ర ఆస్తి, పంట నష్టం సంభవించింది. గంటల పాటు సాగిన ఈ తుఫాను లాంటి వాతావరణంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. బలమైన గాలుల ధాటికి పలు ఇళ్ల పైకప్పు రేకులు గాల్లోకి ఎగిరిపోయాయి. పెద్ద పెద్ద వృక్షాలు, విద్యుత్ స్తంభాలు విరిగి రహదారులపై పడటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా స్తంభించింది. కాగా, గాలివాన తీవ్రతకు ఓ భారీ ట్రాక్టర్ గాల్లోకి లేచి నిలిచిపోయిన దృశ్యం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఈ క్రమంలో పత్తికింటపల్లి గ్రామానికి చెందిన చింతలపల్లి సత్తిరెడ్డి అనే వ్యక్తి ఈదురు గాలుల ధాటికి గురై తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు ఆయనను తక్షణమే ఆసుపత్రికి తరలించారు.
కన్నీరు పెడుతున్న అన్నదాత..
ఈ అకాల వర్షం రైతులకు కోలుకోలేని దెబ్బ తీసింది. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ఓపెన్ క్యాప్‌లలో నిల్వ ఉంచిన వరి ధాన్యం రాశులు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. ఇప్పటికే ఎండలు, ఇతర సమస్యలతో సతమతమవుతున్న తమకు ఈ వర్షం మరింత శాపంగా మారిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి మండలంలో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని, బాధిత కుటుంబాలను ఆదుకోవడంతో పాటు తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని గ్రామస్తులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.