epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాలువ కోసం కట్ట ధ్వంసం!

కాలువ కోసం కట్ట ధ్వంసం!
కెనాల్ మరమ్మతులకు సాగర్ కట్టను తొలుస్తున్న కాంట్రాక్టర్
అనుమతులు లేకుండానే యథేచ్ఛగా మట్టి తోలకాలు
గత పర్మిషన్లనే సాకుగా చూపుతూ అధికారుల సాక్షిగా త‌వ్వ‌కాలు
కట్టలు బలహీనపడితే తెగిపోతుంద‌ని రైతుల ఆందోళ‌న‌
ప‌లితంగా ఆయకట్టు ప్ర‌శ్నార్థ‌కంగా మారుతుంద‌ని ఆవేద‌న‌
మాముళ్ల మ‌త్తులో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు
కాంట్రాక్ట‌ర్‌తో కుమ్మ‌క్క‌య్యారంటూ రైతుల నుంచి విమ‌ర్శ‌లు
ఫిర్యాదు చేసినా స్పందించ‌క‌పోవ‌డంపై త‌లెత్తుతున్న అనుమానాలు
కాక‌తీయ‌, ఏన్కూర్ : ఖ‌మ్మం జిల్లా ఏన్కూర్ మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాలలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాలువ కట్టల మట్టి తోలకాలు యథేచ్ఛగా, బహిరంగంగానే కొనసాగుతున్నాయి. ఎలాంటి తాజా ప్రభుత్వ అనుమతులు లేవని ఒకవైపు సంబంధిత అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం కాంట్రాక్టర్లు దర్జాగా భారీ యంత్రాలను రంగంలోకి దించి మట్టి తవ్వకాలు సాగిస్తుండటం ఇక్కడి పరిపాలనా అస్తవ్యస్తతకు అద్దం పడుతోంది. పొలాలకు నీరందించే కాలువ కట్టలను ఇష్టారాజ్యంగా తొలిచేస్తుండటంతో భవిష్యత్తులో కట్టలు తెగి పంటలు మునిగిపోయే ప్రమాదం ఉందని తెలిసినా, అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతుండటంపై స్థానిక రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
పాత పర్మిషన్ల సాకుతో కొత్త దందా
ప్రస్తుతం మండలంలో సిరిపురం కెనాల్ కాలువ మరమ్మతు పనులు సాగుతున్నాయి. ఈ పనుల కోసమే తాము మట్టిని తరలిస్తున్నామని కాంట్రాక్టర్ వర్గాలు బుకాయిస్తున్నాయి. అయితే అసలు ట్విస్ట్ ఏమిటంటే.. ఒక కాలువ నిర్మాణం లేదా మరమ్మతు కోసం, కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన మరో ప్రధాన కాలువ కట్టను నిలువునా ధ్వంసం చేయడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అధికారులు ఈ అక్రమ తవ్వకాలను ప్రశ్నిస్తే.. కాంట్రాక్టర్ మాత్రం గతంలో ఎప్పుడో పొందిన పాత అనుమతుల పత్రాలను సాకుగా చూపుతూ కాలయాపన చేస్తున్నాడు. తాజా నిబంధనల ప్రకారం ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోయినా, పాత కాగితాలనే అడ్డుపెట్టుకుని లక్షల రూపాయల విలువైన మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు.
కుమ్మక్కైన రెవెన్యూ.. ఇరిగేషన్ అధికారులు
ఈ మొత్తం వ్యవహారంలో రెవెన్యూ మరియు ఇరిగేషన్ (నీటిపారుదల) శాఖల అధికారుల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కళ్ల ముందే జేసీబీలు, ట్రాక్టర్లతో కాలువ కట్టల రూపురేఖలు మారుస్తున్నా అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. కాంట్రాక్టర్ ఇచ్చిన ముడుపుల దెబ్బకు రెండు శాఖల అధికారులు పూర్తిగా నిద్రమత్తులో ఉన్నారని స్థానికులు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు. కాలువ కట్టలు బలహీనపడితే రాబోయే రోజుల్లో నీటి సరఫరా నిలిచిపోతుందని, తద్వారా వేలాది ఎకరాల ఆయకట్టు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, ఏన్కూర్‌లో సాగుతున్న ఈ అక్రమ మట్టి తోలకాలను తక్షణమే నిలిపివేసి, కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.