నామినేటెడ్ పదవులు సీనియర్లకే ఇవ్వాలి
కాంగ్రెస్ సీనియర్ నేత మంద బాబు
కాకతీయ, జూలూరుపాడు : పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడిన సీనియర్ దళిత కాంగ్రెస్ నాయకులకు నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాధాన్యం కల్పించాలని జూలూరుపాడు మండల కాంగ్రెస్ సీనియర్ దళిత నాయకుడు మంద బాబు డిమాండ్ చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో దళితబంధు వంటి లబ్ధి పొంది, ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వలస వచ్చిన కొందరు నాయకులు ఇక్కడ చక్రం తిప్పాలని చూడటం దారుణమని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా మంద బాబు మాట్లాడుతూ కష్టకాలంలో కాంగ్రెస్ వైపు చూడని కొందరు నాయకులు.. ఇప్పుడు వంకర బుద్ధులతో పార్టీలోకి వలసలు వచ్చి ఎస్సీ సెల్ పదవులను అప్పజెప్పుకుంటున్నారని, ఇది నాలాంటి సీనియర్ దళిత నాయకులను తీవ్రంగా అవమానపరచడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పార్టీ అధిష్ఠానం పునరాలోచించాలని కోరారు. ఇప్పుడు జరిగే నామినేటెడ్ మరియు ఎస్సీ సెల్ పదవుల భర్తీలో తనలాంటి సీనియర్ దళిత కాంగ్రెస్ నాయకులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని, లేనిపక్షంలో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని మంద బాబు ప్రభుత్వానికి, పార్టీ పెద్దలకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.

