ఘనంగా తాతా మధు జన్మదిన వేడుకలు!
పెద్ద సంఖ్యలో పాల్గొన్న గులాబీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు
కాకతీయ, ఏన్కూర్ : ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ) తాతా మధుసూదన్ పుట్టినరోజు వేడుకలు ఏన్కూర్ మండల కేంద్రంలో అత్యంత వైభవంగా జరిగాయి. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద ఉన్న బీఆర్ఎస్ పార్టీ దిమ్మె దగ్గర స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ జన్మదిన వేడుకలను ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు లకావత్ గిరిబాబు, బాదావత్ బాలాజీ హాజరయ్యారు. అక్కడ గులాబీ శ్రేణుల సమక్షంలో వారు పెద్ద కేక్ కట్ చేసి, తాతా మధుసూదన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ పటిష్టతకు అహర్నిశలు శ్రమిస్తున్న తాతా మధుసూదన్ ఆయురారోగ్యాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆయన నాయకత్వంలో నియోజకవర్గంలో పార్టీని మరింత ముందుకు తీసుకువెళతామన్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు భుక్యా వినోద్ కుమార్, భుక్యా ధర్మా నాయక్, భుక్యా శివ నాయక్, భుక్యా బాలాజీ నాయక్, షేక్ బాజీ, షేక్ చాంద్ పాషా, కడియాల సుధాకర్, గుగులోత్ మజిలాల్, గుగులోత్ శంకర్, రాచబంటి వీరభద్రం, వెంకటేష్, తెలంగాణ ఉద్యమకారులు గిద్దిగిరి సత్యనారాయణ, కొంటూ సాంబయ్య, ఇంజం దేవదాసులతో పాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

