epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వరప్రదాయిని సీతారామ

వరప్రదాయిని సీతారామ
ఎత్తిపోత‌ల ప‌థ‌కంతో ఖ‌మ్మం జిల్లా స‌స్య‌శ్యామ‌లం
ప్రాజెక్టు పనులపై రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రత్యేక దృష్టి
డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులకు రూ.4,000 కోట్ల నిధులు మంజూరు
రూ.155 కోట్లతో మోడ‌ల్ మార్కెట్‌గా ఖమ్మం యార్డు
రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా పరిధిలోని సాగునీటి రంగాన్ని పూర్తిగా అగ్రపథంలో నిలిపేందుకు ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో అత్యంత వైభవంగా జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, జిల్లాకు వరప్రదాయినిగా మారిన సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల పురోగతిని, దాని ద్వారా జిల్లాకు చేకూరనున్న సాగునీటి ప్రయోజనాలను ప్రత్యేకంగా వివరించారు.
కాలువల పనుల వేగవంతం.. నిధుల వరద
ఖమ్మం జిల్లాలోని లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యంగా సీతారామ ఎత్తిపోతల పథకం, జవహర్ ఎత్తిపోతల పనులను ప్రభుత్వం అత్యంత వేగవంతం చేసిందని డిప్యూటీ సీఎం తెలిపారు. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టు పరిధిలోని డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణ పనుల కోసం ఇప్పటికే రూ.4,000 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కాలువల నిర్మాణం, భూసేకరణ ప్రక్రియలను వేగంగా పూర్తి చేస్తున్నారన్నారు. ఈ పనులు త్వరలోనే తుది దశకు చేరుకోనున్నాయని, దీనివల్ల వచ్చే ఏడాది నాటికి జిల్లాలోని పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల పరిధిలోని ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందే అవకాశం ఉంటుందని భరోసా ఇచ్చారు.
రైతు భరోసా నిధుల జమ.. రూ.155 కోట్లతో మోడల్ మార్కెట్
ఖమ్మం జిల్లాలోని వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రైతు భరోసా పెట్టుబడి సాయం కింద ఈ యాసంగి సీజన్ లో జిల్లా వ్యాప్తంగా 3,43,997 మంది రైతులకు రూ.270.93 కోట్ల నిధులను నేరుగా వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతులు పండించిన పంటలకు సరైన మద్దతు ధర, మెరుగైన వసతులు కల్పించేందుకు గాను రూ.155 కోట్ల భారీ వ్యయంతో ఖమ్మం మార్కెట్ యార్డును మోడల్ మార్కెట్‌గా మారుస్తున్నామని వెల్లడించారు. రైతుల భూమిపై వారికి పూర్తి హక్కుల భద్రత కల్పించేందుకు గాను ప్రభుత్వం కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తుచేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.