epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ట్రబుల్ షూటర్ టు సీఎం

ట్రబుల్ షూటర్ టు సీఎం
క‌ర్ణాట‌క‌లో డీకే శివకుమార్ యుగం ప్రారంభం
నాలుగు దశాబ్దాల నిరీక్షణ, పట్టుదలకు అంద‌లం
ఎట్టకేలకు కర్ణాటక ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన డీకేఎస్
సిద్దరామయ్య నుంచి విజయవంతంగా బదిలీ అయిన అధికారం
సంక్షోభాలను అవకాశాలుగా మలచుకున్న ‘ట్రబుల్‌షూటర్’
తీహార్ జైలు నుంచి టాప్ పొజిషన్ వరకు సాగిన ప్రస్థానం
డీకే శివ‌కుమార్ రాజ‌కీయ‌, ప‌రిపాల‌న స‌వాళ్లు
మౌలిక సదుపాయాల కొరత ఉచిత హామీల ఆర్థిక భారం
కేబినేట్‌లో సమతుల్యత సాధించడం కత్తిమీద సామే
మేకేదాటు ప్రాజెక్టు, కావేరి జల వివాదం..
పొరుగు రాష్ట్రాలతో పొలిటికల్, లీగల్ ఫైట్‌కు సిద్ధం కాక తప్పని పరిస్థితి

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : కర్ణాటక రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయం మొదలైంది. దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి అత్యంత బలమైన వ్యూహకర్తగా, సంక్షోభ సమయాల్లో పార్టీని ఆదుకునే ‘ట్రబుల్‌షూటర్’గా పేరొందిన డొడ్డ ఆలహళ్లి కెంపేగౌడ శివకుమార్ కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. హైకమాండ్ ఫార్ములా ప్రకారం.. మాజీ సీఎం సిద్దరామయ్య నుంచి అధికార మార్పిడి సజావుగా సాగడంతో, డీకేఎస్ తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్నారు. అయితే, సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి, ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, వెయ్యి కోట్లకు పైగా ఆస్తులతో అత్యంత ధనిక నేతగా నిలిచిన డీకే శివకుమార్ ప్రయాణం పూలపాన్పేమీ కాదు. నిర్బంధాలు, ఈడీ అరెస్టులు, తీహార్ జైలు జీవితం.. వీటన్నింటినీ తట్టుకుని ‘ఉక్కు మనిషి’లా నిలబడిన ఆయనకు ఇప్పుడు అసలైన పరిపాలనా పరీక్ష మొదలైంది.

కింగ్‌మేకర్ టు కింగ్ .. జైలు ప్రతిజ్ఞ నెరవేరిన వేళ

1985లో తొలి ఎన్నికల ఓటమితో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన డీకేఎస్, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. సాతనూరు, కనకపుర నియోజకవర్గాలను కాంగ్రెస్‌కు కంచుకోటలుగా మార్చారు. 2002లో మహారాష్ట్ర సంక్షోభం, 2017లో గుజరాత్ రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరు రిసార్టులలో కాపాడి జాతీయ స్థాయిలో రియల్ ట్రబుల్‌షూటర్‌గా ఎదిగారు. 2019లో మనీలాండరింగ్ ఆరోపణలపై 50 రోజులకు పైగా తీహార్ జైలులో గడిపిన సమయంలో.. తాను సీఎం అయ్యే వరకు గడ్డం తీయనంటూ ఆయన చేసిన ప్రతిజ్ఞ నేడు నెరవేరింది. 2023 ఎన్నికల్లో పార్టీని గెలిపించినా.. అధిష్ఠానం మాట కోసం ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి పొలిటికల్ మెచ్యూరిటీ చాటుకున్న శివకుమార్‌కు, ఇప్పుడు పూర్తి స్థాయి అధికారం దక్కింది. తొలిరోజే విద్యార్థులకు ఉచిత బస్ పాస్‌లు, నిరుద్యోగులకు ఉపాధి పథకాలతో డీకేఎస్ తన మార్క్ పాలనను స్పీడప్‌ చేశారు.

గ్యారెంటీల భారం.. అంతర్గత సమతుల్యత

ముఖ్యమంత్రి కుర్చీ దక్కిన ఆనందం ఒకవైపు ఉన్నా.. డీకే శివకుమార్ ముందు ఐదు ప్రధాన సవాళ్లు పర్వతంలా నిలిచి ఉన్నాయి. మొదటిది, పార్టీలో సిద్దరామయ్య వర్గాన్ని, తన వర్గాన్ని సమన్వయం చేసుకుంటూ సామాజిక సమీకరణాల మధ్య క్యాబినెట్‌ను నడపడం. రెండోది, కాంగ్రెస్ ప్రకటించిన ఐదు గ్యారెంటీల వల్ల రాష్ట్ర బడ్జెట్‌పై పడుతున్న అపారమైన ఆర్థిక భారాన్ని మోస్తూనే.. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం. ముఖ్యంగా ఐటీ హబ్ బెంగళూరులో మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి టన్నెల్ రోడ్ల వంటి భారీ ప్రాజెక్టులకు నిధుల సమీకరణ డీకేఎస్‌కు పెద్ద టాస్క్ కానుంది.

అంతరాష్ట్ర వివాదాలు.. 2028 టార్గెట్

రాజకీయ సవాళ్లతో పాటు భౌగోళిక, న్యాయపరమైన సమస్యలు డీకే శివకుమార్‌ను చుట్టుముట్టనున్నాయి. కర్ణాటక-తమిళనాడు మధ్య అత్యంత సున్నితమైన కావేరి జల వివాదం, మేకేదాటు ప్రాజెక్టు నిర్మాణంపై పొరుగు రాష్ట్రంతో పొలిటికల్ అండ్ లీగల్ ఫైట్ చేయాల్సి ఉంటుంది. నీటి పారుదల శాఖను నిర్వహించిన అనుభవం ఇందుకు పనికొచ్చినా, ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను సమతూకం చేయడం అంత తేలిక కాదు. వీటన్నింటినీ అధిగమిస్తూ, ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు రాకుండా చూసుకుంటూ.. 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని మళ్లీ విజయతీరాలకు చేర్చడమే ఈ ‘ట్రబుల్‌షూటర్’ ముందున్న అసలైన ‘పొలిటికల్ ఎగ్జామ్’. ఇప్పటివరకు పార్టీ సమస్యలను తీర్చిన డీకే శివకుమార్.. ఇప్పుడు రాష్ట్ర సమస్యలను ఎలా తీరుస్తారనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ‘డీకేఎస్ యుగం’ కర్ణాటకను అభివృద్ధి పథంలో నడిపిస్తుందా లేక సవాళ్ల సుడిగుండంలో చిక్కుకుంటుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.