epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామ ప్రగతి సాధ్యం

ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామ ప్రగతి సాధ్యం
ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక గ్రామ సభలు
ప్రభుత్వ బడిబాట ద్వారా విద్యార్థుల నమోదు పెంచాలి
మర్రిమడ్ల గ్రామసభలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
ఘన వ్యర్థాల నిర్వహణ, పంట మార్పిడిపై అవగాహన

కాకతీయ, వేములవాడ : గ్రామ ప్రగతి, అభివృద్ధిపై చర్చించుకోవడానికి ప్రత్యేక గ్రామ సభలు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధికి సరైన కార్యాచరణ, ప్రణాళిక రూపొందించవచ్చని తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్షాకాల సన్నద్ధత, పంట మార్పిడి, పారిశుద్ధ్యం, బడిబాట, ఓటరు జాబితా సవరణ తదితర అంశాలపై ప్రజలతో చర్చించారు.

చెత్తను నాలుగు రకాలుగా వేరు చేయాలి
వర్షాకాలానికి ముందే గ్రామాల్లోని డ్రైనేజీలు శుభ్రం చేయడం గ్రామ పంచాయితీ బాధ్యత అని కలెక్టర్ తెలిపారు. డ్రైనేజీల్లో ప్లాస్టిక్, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయవద్దని కోరారు. ఘన వ్యర్థాల నిర్వహణ-2026 పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. చెత్తను తడి, పొడి, సానిటరీ, ప్రత్యేక చెత్తగా నాలుగు రకాలుగా వేరు చేసి పంచాయితీ వాహనానికి అందించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తాగునీటి ట్యాంకులను క్రమం తప్పకుండా బ్లీచింగ్‌తో శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు.

రైతులు పంట మార్పిడి చేయాలి
రైతులు లాభదాయకమైన ఆయిల్ పామ్, కూరగాయలు, పత్తి పంటలను సాగు చేయాలని కలెక్టర్ సూచించారు. వరిలో సన్న వడ్లను సాగు చేస్తే ప్రభుత్వం బోనస్ అందిస్తుందని తెలిపారు. పంట మార్పిడి చేయకపోతే నేల సారం తగ్గుతుందనే విషయాన్ని రైతులు గమనించాలన్నారు. రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని కోరారు. ఈ నెల 25 నుండి ప్రారంభమయ్యే ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు ప్రజలు బీఎల్ఓలకు సహకరించాలన్నారు. బడిబాట ద్వారా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పెంచాలని కోరారు. అనంతరం గ్రామంలోని నర్సరీ, కంపోస్ట్ షెడ్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కుమారి, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.