ఖమ్మంలో ‘మేధన్ష్ ఫుడ్ జోన్’ ప్రారంభం
కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగరం గుట్టల బజార్‌లోని కిన్నెరసాని థియేటర్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ‘మేధన్ష్ ఫుడ్ జోన్’ను టిఎన్‌జిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ఖమ్మం నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. నగర జనాభా పెరుగుదల, విస్తరణకు అనుగుణంగా ఇలాంటి ఆధునిక వసతులతో కూడిన హోటళ్లు రావడం శుభపరిణామమని ఆయన తెలిపారు. వ్యాపార రంగాలు విస్తరించడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, తద్వారా నగర ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఏలూరి శ్రీనివాసరావు మరియు మూడో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యర్రం బాలగంగాధర్ తిలక్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆహార నాణ్యత, శుభ్రతను పాటిస్తేనే వ్యాపారం దీర్ఘకాలం విజయవంతంగా కొనసాగుతుందని, మేధన్ష్ ఫుడ్ జోన్ నిర్వాహకులు కస్టమర్ల మనసులు గెలవాలని వారు సూచించారు. అనంతరం ఫుడ్ జోన్ ప్రోప్రైటర్స్ కూచిపూడి శ్రీనివాసరావు, కూచిపూడి ఉదయ్ కుమార్‌లను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో టిఎన్‌జిఓ జిల్లా అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి కొనిదేనా శ్రీనివాస్, అసోసియేషన్ అధ్యక్షులు కోమగిరే దుర్గ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ వల్లూరి శ్రీకాంత్, కూరపాటి రుక్మారావు, కాంగ్రెస్ నాయకులు డి. శంకర్ నాయక్, కూచిపూడి ముద్దు కృష్ణ, మెట్టు సల్మాన్, కూచిపూడి ప్రవీణ్ కుమార్, కూచిపూడి ఉపేందర్, దేవరకొండ ఫని, సురవెల్లి శ్రీనివాస్, కలకోట వెంకన్న, వెంపటి సాయి తదితరులు పాల్గొన్నారు.

