epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వీరాపురం ఇసుక రీచ్ కేటాయింపు ఏక‌ప‌క్షం

వీరాపురం ఇసుక రీచ్ కేటాయింపు ఏక‌ప‌క్షం
గిరిజన మహిళా సంఘానికి తీవ్ర‌ అన్యాయం
నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా పంచాయతీ తీర్మానం
సొసైటీకి సమాచారం ఇవ్వకుండానే మరొకరికి అనుకూలంగా నిర్ణయం
గ్రామసభ నిర్వహణ.. తీర్మానం చెల్ల‌దు..
కలెక్టర్, అధికారులకు మొరపెట్టుకున్నాం
అయినా ప‌ట్టించుకోవ‌డం లేదు
వర్క్ ఆర్డర్ నిలిపివేసి మాకు న్యాయం చేయాలి
పిన‌పాక‌లో శ్రీగిరి లక్ష్మి ఇసుక క్వారీ మ‌హిళా సంఘం స‌భ్యుల ఆందోళ‌న‌

కాకతీయ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వీరాపురం ఇసుక రీచ్ కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతోందని దుగినేపల్లికి చెందిన “శ్రీగిరి లక్ష్మి ఇసుక క్వారీ ట్రైబల్ లేబర్ కాంట్రాక్ట్ సహకార సంఘం లిమిటెడ్” సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. 1964 చట్టం ప్రకారం నమోదైన తమ సంఘం, దశాబ్దాలుగా గిరిజన మహిళలకు ఉపాధి కల్పిస్తూ ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఇసుక కార్యకలాపాలు నిర్వహిస్తోందని వారు తెలిపారు. వీరాపురం ఇసుక రీచ్ విషయంలో అధికారులు, స్థానిక పంచాయతీ వ్యవహరిస్తున్న తీరు గిరిజన మహిళల జీవనోపాధిని దెబ్బతీస్తోందని వారు ఆరోపించారు.

ఏకపక్షంగా పంచాయతీ తీర్మానం
వీరాపురం ఇసుక రీచ్‌కు సంబంధించి ఈ ఏడాది మే 19న జిల్లా స్థాయి ఇసుక కమిటీ 1,85,500 క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు ఆమోదం తెలిపింది. అయితే, ఆ ఉత్తర్వుల్లో ఏ సొసైటీ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. ఆ తర్వాత రంగంలోకి దిగిన అధికారులు, ప్రాంతంలో రెండు గిరిజన మహిళా సంఘాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ దశలో, తమ సంఘానికి ఎటువంటి నోటీసు ఇవ్వకుండా, కనీసం అభిప్రాయం కూడా తీసుకోకుండా గ్రామపంచాయతీ అధికారులు ఏకపక్షంగా మరో సంఘానికి అనుకూలంగా తీర్మానం పంపి, నిబంధనలను తుంగలో తొక్కారని సంఘ సభ్యులు వాపోయారు. అసలు గ్రామసభను చట్టబద్ధంగా నిర్వహించారా లేదా అనే అంశంపై కూడా తీవ్ర అనుమానాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు.

అధికారుల వివక్షతోనే అన్యాయం
ఈ అక్రమాలపై బాధితులు కలెక్టర్, జిల్లా సహకార అధికారి, తెలంగాణ గనుల అభివృద్ధి సంస్థ అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా తమకు న్యాయం జరగడం లేదని, అధికారుల వివక్ష వల్లే తాము అన్యాయానికి గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గ్రామపంచాయతీ తీర్మానం చట్టబద్ధతపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వివాదం పూర్తిగా పరిష్కారమయ్యే వరకు వీరాపురం ఇసుక రీచ్‌కు సంబంధించి ఎలాంటి వర్క్ ఆర్డర్ జారీ చేయకుండా నిలిపివేయాలని వారు స్పష్టం చేశారు. రెండు సంఘాలకు సమాన అవకాశాలు కల్పించి, తమ సంఘానికి వినికిడి అవకాశం కల్పించాలని కోరారు. గిరిజన మహిళల హక్కులను పరిరక్షించే విధంగా అధికారులు న్యాయమైన నిర్ణయం తీసుకోకపోతే, తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.