నాయీబ్రాహ్మణ సేవాసంఘం అధ్యక్షుడిగా తిప్పబత్తిని నారాయణ
కాకతీయ,శంకరపట్నం:శంకరపట్నం మండల నాయీబ్రాహ్మణ సేవాసంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు నీలం మొండయ్య నాయీ పర్యవేక్షణలో మంగళవారం రోజు ప్రజాస్వామ్య పద్ధతిలో సంఘ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తిప్పబత్తిని నారాయణ నాయీ 30 ఓట్ల మెజార్టీతో మండల అధ్యక్షుడిగా విజయం సాధించారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా దుబ్బాక మహేష్ నాయీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్నికలను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల సంపత్ నాయీ, జిల్లా గౌరవ అధ్యక్షులు ఔదుర్తి లక్ష్మణ్ కుమార్ నాయీ, జిల్లా ఉపాధ్యక్షులు జంపాల భిక్షపతి నాయీ హాజరై నూతనంగా ఎన్నికైన ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.

