epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తడిగుడ్డతో రైతుల గొంతు కోసిన కాంగ్రెస్

తడిగుడ్డతో రైతుల గొంతు కోసిన కాంగ్రెస్
33 రకాల సన్నాల నుంచి 7 రకాలకే బోనస్ పరిమితం
రాహుల్ గాంధీ ఇచ్చిన రైతు డిక్లరేషన్ హామీలు తుంగలో
కొనుగోళ్లు, రైతుబంధు, రైతుబీమా, యూరియా అన్నీ ఖతం
జొన్నలు, మక్కల కొనుగోళ్ల బాధ్యత నుంచి తప్పుకునే కుట్ర
వరంగల్ జిల్లాలో తీవ్రమైన యూరియా కొరత
న‌ర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

కాక‌తీయ‌, న‌ర్సంపేట టౌన్ : ఎన్నికల ముందు రైతులకు భారీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతాంగాన్ని నట్టేట ముంచి తడిగుడ్డతో గొంతు కోసిందని బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు కేంద్రం చెప్పిన పంటలనే కొనుగోలు చేస్తామని ప్రకటించడం రైతులను దారుణంగా మోసం చేయడమేనని విమర్శించారు. శనివారం నర్సంపేటలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ ప్రకటించిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కిందని పెద్ది సుదర్శన్ రెడ్డి ధ్వజమెత్తారు. సన్నరకాల వరికి బోనస్ ఇస్తామని ప్రకటించి మొదట 33 రకాల వరి రకాలను గుర్తించిన ప్రభుత్వం, ఇప్పుడు కేవలం 7 రకాలకే పరిమితం చేయడం వెనుక బోనస్ ఎగ్గొట్టే కుట్ర దాగి ఉందని ఆరోపించారు. రైతులకు ఎక్కువ దిగుబడి వచ్చే రకాలను పక్కనపెట్టి, తక్కువ దిగుబడి వచ్చే రకాలకే బోనస్ వర్తింపజేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని నమ్మించి, ఇప్పుడు కేంద్రం ఎంత కొనమంటే అంతే కొంటామని చెప్పడం కాంగ్రెస్ రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనమన్నారు.

కేసీఆర్ హయాంలో అండగా నిలిచాం
కేసీఆర్ హయాంలో కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసినా, చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే పంటలను కొనుగోలు చేసి రైతులకు మద్దతుగా నిలిచిందని పెద్ది సుదర్శన్ రెడ్డి గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోళ్ల బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కేంద్రం జొన్నలు, మక్కలు కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనబోదన్న సంకేతాలు రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. మిర్చి సాగు విస్తారంగా ఉన్న వరంగల్ జిల్లాలో రైతులకు అవసరమైనంత యూరియా అందడం లేదని, కేవలం రెండు బస్తాలతో రైతులు ఎలా సాగు చేయాలని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతుల సమస్యలను పూర్తిగా గాలికొదిలేశాయని విమర్శించారు.

పథకాలన్నీ పూర్తిగా నిర్వీర్యం
రైతుబంధు, రైతుబీమా పథకాల అమలులోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ముందు రైతుబంధును పెంచుతామని చెప్పి అసలుకే ఎగ్గొట్టారని, రైతుబీమా చెల్లింపులు కూడా నెలల తరబడి పెండింగ్‌లో ఉంచారని అన్నారు. కొనుగోళ్లు ఖతం, రైతుబంధు ఖతం, రైతుబీమా ఖతం, యూరియా ఖతం చేస్తూ రైతులకు ఏమీ మిగల్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతు వ్యతిరేక నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకుని, రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, బీఆర్టీయూ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.