epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జులై 2న ఉప్పల్ భగాయత్‌లో ‘భూ పోరాటం’

జులై 2న ఉప్పల్ భగాయత్‌లో ‘భూ పోరాటం’
స్థానికత విషయంలో మళ్లీ కుట్రలు మొదలయ్యాయి
ఒకటి నుంచి 7వ తరగతి వరకు ఎక్కడ చదివినా స్థానికులా?
హైకోర్టు తీర్పుపై లీగల్ ఫైట్ చేస్తాం
మన బిడ్డల హక్కులను కాపాడటంలో వెనక్కి తగ్గేది లేదు
విజయవంతం చేయాలని కల్వకుంట్ల కవిత పిలుపు
ఖైరతాబాద్ ఎంఎస్ మక్తాలో పార్టీ జెండా ఆవిష్కరించిన కవిత

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి స్థలాల సాధన కోసం జూలై 2న ఉప్పల్ భగాయత్‌లో చేపట్టనున్న ‘భూ పోరాటాన్ని’ విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. బుధవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎంఎస్ మక్తాలో ఆమె పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు రాజ్ భవన్ ఎదురుగా ఉన్న రైల్వే గేట్ నుంచి జెండా గద్దె వరకు పాదయాత్ర నిర్వహించి, స్థానిక బస్తీ ప్రజలతో ముచ్చటించారు. జెండా ఆవిష్కరణ అనంతరం కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల చొప్పున ఇంటి స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా నిలబెట్టుకోవడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ప్రతి ఉద్యమకారుడికి ఇంటి స్థలం సాధించడమే ధ్యేయంగా తాము ఈ భూపోరాటానికి పిలుపునిచ్చామని చెప్పారు. రాష్ట్ర ప్రజలు, ఉద్యమకారులు, మేధావులు ఈ పోరాటంలో పాల్గొనాలని కోరారు.

తెలంగాణ స్థానికతపై మళ్లీ కుట్రలు

తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు దక్కాలన్న రాష్ట్ర స్థానికత అంశంపై మళ్లీ కుట్రలు మొదలయ్యాయని కవిత ఆరోపించారు. తెలంగాణలో 1 నుంచి 7వ తరగతి వరకు ఇక్కడ చదివిన వారినే రాష్ట్ర స్థానికులుగా గుర్తించాల్సి ఉందన్నారు. దానికి విరుద్ధంగా ప్రొఫెషనల్ కోర్సులు ఇక్కడ చదివిన వారిని కూడా స్థానికులుగా పరిగణించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ బిడ్డలను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కడ చదివినా సరే తెలంగాణలో ప్రొఫెషనల్ కోర్సులలో చేరవచ్చని, ఆ డిగ్రీలతో ఇక్కడ ఉద్యోగాలు దక్కించుకోవచ్చని కోర్టు తీర్పు ఇవ్వడంపై లీగల్ ఫైట్ చేయబోతున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ కాలంలో హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా పేర్కొంటూ కోర్టు తీర్పు ఇస్తే యావత్ రాష్ట్రం భగ్గుమందని, రాష్ట్ర విభజన సమయంలోనూ హైదరాబాద్‌ను కామన్ క్యాపిటల్ చేయాలనే డిమాండ్‌ను బరిగీసి కొట్లాడి విరమింపజేశామని గుర్తుచేశారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో స్థానికత అంశంపై కొట్లాడాల్సిన సమయం వచ్చిందన్నారు. తెలంగాణ రక్షణ సేన అంటేనే తెలంగాణను రక్షించేందుకు పుట్టిన పార్టీ అని, స్థానికత, ప్రజల హక్కుల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతాం

ఎంఎస్ మక్తాలో మొట్టమొదటి సారిగా పార్టీ జెండా ఎగురవేస్తున్నామని, వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటి, ఆ తర్వాత ఖైరతాబాద్ అసెంబ్లీ సీటును గెలుచుకుంటామని కవిత ధీమా వ్యక్తం చేశారు. అత్యంత పేదల పక్షాన తమ పార్టీ పోరాడుతుందన్నారు. తెలంగాణ వచ్చిన 12 ఏళ్ల తర్వాత కూడా ఎంఎస్ మక్తా వాసులకు ఇండ్ల పట్టాలు ఇవ్వలేదని, ఇక్కడి ప్రజలు నీళ్లు, డ్రెయినేజీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాంప్రదాయ పార్టీల మాదిరిగా కాకుండా ప్రజల్లో ఉండి వారికోసం పనిచేయాలని నాయకులకు సూచించారు. ఎంతో ప్రతిభ, కష్టపడే గుణం ఉన్నప్పటికీ మహిళలకు సరైన అవకాశాలు రావడం లేదని కవిత విచారం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్‌లో బుధవారం నిర్వహించిన మహిళా సాధికారిత సదస్సులో ఆమె మాట్లాడారు. కొంచెం భిన్నంగా ఉండే మహిళలను ఇప్పటికీ అణిచివేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో 15 నుంచి 19 ఏళ్ల వయసులోనే తల్లి అవుతున్న మహిళల సంఖ్య 7.2 శాతంగా ఉండగా, హైదరాబాద్ లాంటి నగరంలోనూ టీనేజ్ మదర్స్ సంఖ్య 2.7 శాతంగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆడపిల్లకు పెళ్లి చేసి పంపిస్తే బాధ్యత తీరుతుందనే తల్లిదండ్రుల ఆలోచనా విధానమే దీనికి కారణమన్నారు.

తెలంగాణ వచ్చాక కానిస్టేబుల్ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తెచ్చుకున్నా ఇప్పటికీ అవి పూర్తిస్థాయిలో భర్తీ కావడం లేదని, దీనికి కుటుంబాల సహకారం అవసరమని పేర్కొన్నారు. తాను ఏ విషయం మాట్లాడినా అంశాన్ని వదిలేసి జెండర్ బేస్డ్‌గా ట్రోల్ చేస్తున్నారని, ఇలాంటి వాటికి బెదరకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని మహిళలకు పిలుపునిచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.