epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నిజం రాయడం నేరమా?

నిజం రాయడం నేరమా?
అక్రమాలను ప్రశ్నిస్తే అసత్య ప్రచారాలా?
స్పష్ట‌త కోసం రిపోర్ట‌ర్‌ ఫోన్ చేస్తే రాజీ కోసం వ‌చ్చిన‌ట్లా..?
ఆధారాలు ఉంటే బయటపెట్టు.. చట్టపరంగా ఎదుర్కో!
వ్యక్తిగత కక్ష కాదు.. మా పోరాటం వ్యవస్థా వ్యతిరేకతపైనే!
అసత్య ప్రచారాలు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు
ఉత్త‌రం కాక‌తీయ‌పై త‌ప్పుడు ప్ర‌చారంచేస్తే త‌గిన మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు
శ్రీకర్ బెదిరింపులు లొంగ‌బోయేది లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నాం

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : నిజం నిప్పులాంటిది.. అది ఎవరికైనా తగలక మానదు. మణుగూరులో ఇసుక ర్యాంపుల ముసుగులో జరుగుతున్న అక్రమాలపై ఉత్త‌రం కాకతీయ పత్రిక రాస్తున్న వరుస కథనాలు, ఇప్పుడు ఇసుక కాంట్రాక్టర్ శ్రీకర్‌కు మింగుడుపడటం లేదు. వాస్తవాలను రాస్తున్నందుకు, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకు కాకతీయపై అసత్య ప్రచారాలకు తెరలేపడం శ్రీకర్ అసమర్థతకు పరాకాష్ట. ఉన్నది ఉన్నట్లుగా రాస్తే ఉలిక్కిపడుతున్న శ్రీకర్, ఆ భయంలోనే పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు. అసలు క్వశ్చన్ పేపర్ శ్రీకర్ చేతిలోనే ఉంటే, సమాధానం చెప్పలేక ఇతరులను ఎందుకు నిందిస్తున్నారు?

ఫోన్ కాల్‌ వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి?

స్పష్టత కోసం మా రిపోర్టర్ ర్యాంపుల్లో భాగ‌స్వామిగా ఉన్న ఓ కాంట్రాక్ట‌ర్‌కు ఫోన్ చేస్తే.. దాన్ని రాజీ కోసం వచ్చినట్లుగా చిత్రించే ప్రయత్నం చేయడం శ్రీకర్ దిగజారుడుతనానికి నిదర్శనం. అలాంటప్పుడు, నీ తరఫున మాకు ఫోన్లు చేయించిన వాళ్లను ఏమనాలి? వారు దేని కోసం ఫోన్ చేశారు? శ్రీకర్ తన అక్రమాలను దాచుకోవడానికి చేస్తున్న ప్రతి ప్రయత్నం, ఒక బురద చల్లుకునే ప్రయత్నమేనని ప్రజలకు అర్థమవుతోంది. శ‌నివారం ఉద‌యం నుంచి ఉత్త‌రం కాక‌తీయ శ్రీక‌ర్‌ను డబ్బులు డిమాండ్ చేసిన‌ట్లుగా శ్రీక‌ర్ పేరుతో కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో మెసేజులు పెట్టించ‌డం ఆయ‌న స్థితికి నిద‌ర్శ‌నం. శ్రీకర్ మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే బయటపెట్టండి. లేదంటే పరువునష్టం దావా వేయ్.. చట్టపరమైన చర్యలు తీసుకో. అది వదిలేసి, అసత్య ప్రచారాలు చేసి బెదిరించాలని చూస్తే, ఉత్త‌రం కాకతీయ పత్రిక ఏనాడూ భయపడదు.

మా పోరాటం వ్యక్తిగతం కాదు.. వ్యవస్థాత్మకం!

మాకు శ్రీకర్‌పై ఏ వ్యక్తిగత కక్ష లేదు. ర్యాంపుల వ్య‌వ‌హారంలో నీ పాత్ర ఏంటో, ఏ స్థాయి అక్రమాలు జరుగుతున్నాయో మాత్రమే మేము రాస్తున్నాం. గిరిజనుల ఉపాధిని దెబ్బకొట్టే ఉద్దేశం మాకు ఏమాత్రం లేదు, కనీసం మా కథనాల్లో ఆ ప్రస్తావన కూడా లేదు. అసలు గిరిజనుల పొట్ట కొడుతున్నది, వారి పేరుతో కోట్లు గడిస్తున్నది ఎవరు? ఈ విషయం మణుగూరులోని ప్రతి ఒక్కరికీ తెలుసు. మా పోరాటం అంతా ర్యాంపుల్లో జరుగుతున్న అక్రమ తవ్వకాలు, నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఇసుక రవాణాపైనే. లారీ యజమానుల నుంచి జరుగుతున్న అక్రమ వసూళ్లపైనే మా అక్షర ఆయుధాలు. ఈ అక్రమాలకు సహకరిస్తున్న యంత్రాంగం, వారిని వెనకుండి నడిపిస్తున్న రాజకీయ నేతలపైనే మా వరుస కథనాలు. అక్రమాలను ఎండగట్టడం ఒక ప‌త్రిక‌గా మా బాధ్యత. అందుకే కొద్ది రోజులుగా వరుస కథనాలు రాస్తున్నాం. ఈ క‌థ‌నాల‌కు స్థానికంగా ఉన్న ఎంతో విద్యావంతులు, గిరిజ‌న యువ‌త‌, సామాజిక స్పృహ ఉన్న వారి నుంచి ఇన్‌పుట్‌కూడా అందుతోంది. అందుకే రాయ‌గ‌లుగుతున్నాం. రాస్తాం కూడా. ఈ వాస్తవాలను పక్కన పెట్టి, ప్రజల దృష్టిని మళ్లించడానికి, విషయాన్ని సైడ్ ట్రాక్ పట్టించడానికి శ్రీకర్ చేస్తున్న ప్రతి ప్రయత్నం విఫలయత్నమే. శ్రీకర్.. అబద్ధాలను వంద సార్లు చెబితే నిజం కావు. ఆధారాలు లేకుండా కాకతీయపై ఆరోపణలు చేస్తే, మీకే నష్టం తప్ప మాకేం లేదు. ఇప్పటికైనా అక్రమ దందాను ఆపి, చట్టబద్ధంగా నడుచుకోవడం నేర్చుకోండి. అక్రమాలపై వార్త‌లు రాస్తే బెదిరిస్తే మాకు చ‌ట్టం,న్యాయప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకునే విధానం తెలుసు. ఈ అసత్య ప్రచారాలు, బెదిరింపులు మా ముందు ఏమాత్రం చెల్లవు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.