epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

డీసిల్టేషన్ పేరుతో అక్రమ ఇసుక దందా

డీసిల్టేషన్ పేరుతో అక్రమ ఇసుక దందా
ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ఇసుక వేటలో మంత్రులు, ఎమ్మెల్యేలు
లైసెన్సులు లేని డ్రైవర్లతో లారీలు నడిపిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం
వారం రోజుల్లో ముగ్గురు యువకులు మృతి
త్వరలోనే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఇసుక ర్యాంపులపై ఆందోళనలు
మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు

కాకతీయ, మణుగూరు : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం డీసిల్టేషన్ (పూడికతీత) పేరుతో భారీ అక్రమ ఇసుక దందాకు తెరలేపిందని, ఏకంగా గోదావరి నదినే ఊడ్చేస్తూ లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారని పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సంచలన ఆరోపణలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కేవలం ఇసుక అక్రమ సంపాదనపైనే శ్రద్ధ పెట్టారని మండిపడ్డారు. పట్టా ల్యాండ్స్ పేరుతో లోడింగ్ చేస్తూ ఏకంగా గోదావరి నది లోపలి నుంచే భారీ మిషనరీలను ఉపయోగించి అక్రమంగా ఇసుక తోలకాలు సాగిస్తున్నారని రేగా కాంతారావు ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సొసైటీల ముసుగులో రేజింగ్ కాంట్రాక్టర్లతో చేతులు కలిపి ఈ దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. దీనికి సంబంధించిన క్వారీ లొకేషన్లు, గూగుల్ మ్యాప్స్ ఆధారాలన్నీ తమ వద్ద సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. స్థానిక అధికారులు సైతం కాంట్రాక్టర్ల నీడలోనే బతుకుతూ దొంగలకు పూర్తిగా సహకరిస్తున్నారని దుయ్యబట్టారు.

ఇసుక లారీల బీభత్సం.. అధికారుల నిర్లక్ష్యం
మణుగూరు ప్రాంతంలో ఇసుక లారీల మితిమీరిన వేగం, నిర్లక్ష్యం వల్ల వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురు పచ్చని యువకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని రేగా కాంతారావు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఈ ఇసుక లారీలు నడుపుతున్న డ్రైవర్లకు లైసెన్సులు ఉన్నాయా.. లేవా? అనే కనీస నిబంధనలను కూడా రవాణా, పోలీస్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. లైసెన్స్ లేని అనామక డ్రైవర్లతో లారీలు నడిపిస్తూ ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులను పొట్టనబెట్టుకుంటున్నారని, దీనిపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.

ఇసుక ర్యాంపులపై బీఆర్‌ఎస్ పోరాటం
ఈ అక్రమ ఇసుక దందాలపై ప్రజల నుంచి తిరుగుబాటు రావాలని, ప్రజలంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. త్వరలోనే మణుగూరు, పినపాక నియోజకవర్గాల పరిధిలోని ఇసుక ర్యాంపులపై బీఆర్‌ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న అధికారులపై భవిష్యత్తులో ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, ఇప్పటికైనా అధికారులు బరితెగించి వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రేగా కాంతారావు హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.