విగ్రహ ప్రతిష్ఠాపనలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కాకతీయ, రుద్రంగి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని దసరా నాయక్ తండాలో శ్రీ జగదాంబ మేరమ్మ, సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు పొందారు. తండా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం నిర్వాహకులు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. గిరిజనుల ఆధ్యాత్మిక సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. తండాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, తండా వాసులు పాల్గొన్నారు.

